కళ్యాణదుర్గం ( జనస్వరం ) : కళ్యాణదుర్గం నియోజకవర్గం బ్రహ్మసముద్రం మండల కేంద్రంలో "జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ కార్యక్రమం" మరియు "జనసేన పార్టీ బహిరంగ సభ" ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగా అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి, తర్వాత జనసేన పార్టీ జెండా ఆవిష్కరణ చేసి, ముఖ్య అతిథులు జనసేన పార్టీ బహిరంగ సభలో ప్రసంగించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జనసేన పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ జయరామిరెడ్డి, జనసేన పార్టీ జిల్లా లీగల్ సెల్ అధ్యక్షులు మురళీకృష్ణ, జనసేన పార్టీ జిల్లా జాయింట్ సెక్రెటరీ మరియు జనసేన-టిడిపి పాయింట్ ఆఫ్ కాంటాక్ట్ పర్సన్ బాల్యం రాజేష్, కళ్యాణదుర్గం నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ ఉమామహేశ్వరనాయుడు, తెలుగుదేశం పార్టీ జిల్లా కార్యదర్శి తలారి సత్తి బ్రహ్మసముద్రం టిడిపి కన్వీనర్ శ్రీరాములు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అదేవిధంగా ఈ కార్యక్రమంలో 5 మండలాల జనసేన పార్టీ అధ్యక్షులు, కళ్యాణదుర్గం పట్టణ జనసేన పార్టీ అధ్యక్షులు, కళ్యాణదుర్గం జనసేన పార్టీ ముఖ్య నాయకులు, కళ్యాణదుర్గం జనసేన పార్టీ వీర మహిళలు షేక్ తార, మమత మరియు అఖిల భారత చిరంజీవి యువత కళ్యాణదుర్గం తాలూకా అధ్యక్షులు, 5 మండలాల నుండి వచ్చిన జనసేన కార్యకర్తలు, నాయకులు, వీరమహిళలు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com