ఇచ్ఛాపురం, (జనస్వరం) : ఇచ్ఛాపురం నియోజక వర్గం కేదారిపురం పంచాయితీలో తిప్పన దుర్యోధన రెడ్డి నీలవేణి దంపతుల ఆధ్వర్యంలో జనసైనికులు దీనబంధు శెట్టి తన స్వంత స్థలంలో కుటుంబ సభ్యులు, జనసైనికులు పవన్ రాజా, కాకినాడ సంతోష్, బొర మోహన్ రెడ్డి, పంచాయితీ జనసైనికులు సహకారంతో జనసేనపార్టీ జెండా స్థూపం నిర్మించడం జరిగింది. ఇచ్ఛాపురం జనసేన ఇంఛార్జి దాసరి రాజు, జనసేన రాష్ట్ర జాయింట్ సెక్రటరీ తిప్పన దుర్యోధన రెడ్డి, జనసేన రాష్ట్ర మత్స్యకార వికాస విభాగ కార్యదర్శి నాగుల హరి బెహరా చేతుల మీదగా పండగ వాతావరణంలో జనసేన జెండా ఆవిష్కరణ కార్యక్రమం జరిగింది. తదుపరి జనసేన క్రియాశీలక సభ్యులకు ప్రమాద భీమా కిట్లు పంపిణీ చేశారు. అలాగే జనసేనపార్టీ సిద్ధాంతాలు పవన్ కళ్యాణ్ ఆశయాలుకు ఆకర్షితులై కేదారిపురం పంచాయితీకి చెందిన దాదాపుగా 25 కుటుంబాలకు చెందిన గ్రామస్తులు, మహిళలు, వృద్దులు జనసేనపార్టీలో చేరారు. వీరికి దాసరి రాజు, తిప్పన దుర్యోధన నీలవేణి రెడ్డి, హరి బెహరా కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా దాసరి రాజు మాట్లాడుతూ స్వాతంత్ర్యం వచ్చి 75 ఏళ్లు అయినా ఇంకా మనం మంచి రోడ్లు కోసం, నాణ్యమైన విద్య, సరైన వైద్యం వంటి మౌళిక సదుపాయాల కోసం పోరాడాల్సి వస్తుంది, అధికార పార్టీ సంక్షేమ పథకాల పేరుతో ప్రజల్ని మోసం చేస్తున్నారు. కేవలం సంక్షేమ పథకాలు ద్వారా అభివృద్ది జరగదు అని, ఉపాధి లేదు యువతికి ఉద్యోగాలు లేవు అని జనసేన ప్రభుత్వం స్థాపిస్తే పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అయితేనే మన బతుకులు బాగుపడతాయి అని అన్నారు. దుర్యోధన రెడ్డి మాట్లాడుతూ కేదారిపురం పంచాయితీలో డ్రైనేజీ సమస్య చాలా ఉంది పట్టించుకునే నాథుడే లేడని, రేవు కోసం అనుమతులు అడిగిన పట్టించుకోవడంలేదని, జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి రేవు సమస్య పరిష్కారం కోసం కృషి చేస్తాం అని, మంచి నీటి సమస్య కూడా ఇక్కడ ఎక్కువ ఉందని, అవినీతి లేని రాజకీయం చూడాలంటే జనసేనపార్టీకి అవకాశం ఇవ్వాలని అన్నారు. హరి బెహరా మాట్లాడుతూ నియోజక వర్గ సమస్యలు తీరాలంటే ఇక్కడ మంచి నాయకత్వం అవసరం అని, కొత్తవారికి అవకాశం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు, ఇచ్ఛాపురం మున్సిపాలిటీ ఇంఛార్జిలు, వీర మహిళలు, జనసైనికులు భారీగా పాల్గొన్నారు.