నెల్లూరు ( జనస్వరం ) : నెల్లూరు నగరంలోని 1వ డివిజన్‌లో జనసేన పార్టీ జెండాను ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి మనుక్రాంత్‌రెడ్డి గురువారం ఆవిష్కరించారు. ఆ డివిజన్ ఇన్‌చార్జి పవన్‌కుమార్ యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన 50 అడుగుల జెండాను ఆయన ఆవిష్కరించారు. అదే విధంగా జనసేన పార్టీ కార్యాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. ఆ పార్టీ కార్యాలయాన్ని జనసేన నెల్లూరు నగర అధ్యక్షుడు దుగ్గిశెట్టి సుజయ్‌బాబు రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జనసేన పార్టీ అభివృద్ధి కోసం 1వ డివిజన్‌లో పవన్‌కుమార్ యాదవ్ విశేషంగా కృషి చేస్తున్నారన్నారు. త్వరలో జరగబోయే ఎన్నికల్లో ఉమ్మడి జనసేన – టీడీపీ అభ్యర్థి గెలుపులో కీలక పాత్ర పోషించాలని సూచించారు. అనంతరం పవన్‌కుమార్ .. జనసేన జిల్లా నేతలను ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి కొట్టే వెంకటేశ్వర్లు, జిల్లా కార్యదర్శి షేక్ ఆలియా, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వార్ బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి మున్వార్ బాషా, నాయకులు కంతర్, కరీం, అజయ్, శ్రీను ముదిరాజ్ , సుల్తాన్, ప్రతాప్, జీవన్, కైఫ్ ,జనసైనికులు, వీరమహిలలు తదితరులు పాల్గొన్నారు.