
గజపతినగరం ( జనస్వరం ) : ఉమ్మడి జిల్లా కార్యనిర్వాహన కమిటీ సభ్యులు మామిడి దుర్గా ప్రసాద్ ఆధ్యర్యంలో కొమటిపల్లి గ్రామంలో జనసేన జెండా ఆవిష్కరణ జరిగింది. ముఖ్య అతిథిగా జనసేనపార్టీ PAC సభ్యురాలు పడాల అరుణ మరియు జనసేనపార్టీ లీగల్ సెల్ గెద్ద రవి పాల్గొన్నారు. పెదమానాపురం రైల్వే గేటు దగ్గరకు వచ్చి భారీ బైక్ ర్యాలీగా కోమటిపల్లి గ్రామానికి వెళ్తూ జనసేన జెండా ఎగర వేశారు. జనసేన-తెలుగుదేశం ఉమ్మడి కార్యాచారణ అందరం కలిసి కట్టుగా పనిచేసి ఈ అవినీతి ప్రభుత్వాన్ని ఓడించేలా పనిచేయాలని పడాలా అరుణ అన్నారు. టీడీపీ జనసేన నాయకులు జాబ్ కేలెండర్, ప్రత్యేక హోదా, మద్యపాన నిషేధం, రోడ్లు సమస్యలు, విద్యుత్ చార్జీలు గురుంచి మండిపడ్డారు. 2024లో వచ్చేది జనసేన & తెలుగుదేశం ఉమ్మడి ప్రభుత్వంమే అని మాట్లాడటం జరిగింది. జనసేన పార్టీ ఆధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు సిద్ధాంతాలు ప్రతి గ్రామంలో మంచి చేసే నాయకులు ఉండాలని అయన ఆలోచనలును ముందుకు తీసుకువెళ్లే దిశగా అడుగులు వేస్తున్న జనసైనికులుకు, వీరమహిళలుకు, పవన్ కళ్యాణ్ గారి అభిమానులకు, మండలం ఆధ్యక్షులుకు, జిల్లా మరియు నియోజకవర్గం ముఖ్య నాయకులుకు అందరకి ధన్యవాదాలు తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు, వీరమహిళలు, తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు పాల్గొన్నారు.