Logo
Date of Publish : 02 February 2022, 4:33 pm
Editor : Sake Naresh

ప్రభుత్వ పాలన పై సర్వత్రా నిరసన : నరసన్నపేట జనసేన నియోజకవర్గ ఇంఛార్జ్ జయరాం

     నరసన్నపేట, (జనస్వరం) : రాష్ట్రంలో నేడు కొనసాగుతున్న పరిస్థితుల దృష్ట్యా సర్వత్ర నిరసన వ్యక్తమవుతోందని దీనిని జనసేన పార్టీ మళ్లించేందుకు గాను సరైన అవకాశం లభించిందని నరసన్నపేట నియోజకవర్గ ఇంఛార్జ్ జయరాం తెలిపారు. బుధవారం నరసన్నపేట మండలంలోని మడపం గ్రామంలో జనసేన కార్యకర్తలతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల జరిగిన ఉద్యోగుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు. ఈ క్రమంలోనే ఉద్యోగులు తిరుగుబాటు చేస్తున్నారని వివరించారు. ఇదే విషయాలను ప్రజల్లోకి తీసుకుని వెళ్లి ప్రభుత్వ వైఫల్యాలను తెలియజేసిన అవసరం నేడు ఏర్పడిందని పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని వచ్చే ఎన్నికలలో పవన్ కళ్యాణ్ గారిని గెలిపించుకోవలసిన అవసరం ఉందని ఆయన ముఖ్యమంత్రి అయితే నిరుద్యోగ సమస్యతో పాటు ఉద్యోగుల సమస్యలను కూడా పూర్తిస్థాయిలో పరిష్కరించగలరని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన కార్యకర్తలు విరివిగా పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com