నర్సీపట్నం ( జనస్వరం ) : సీతన్న అగ్రహారం గ్రామంలో జనసేన నాయకులు నమ్మి రమణరాజు, నమ్మి మంగరాజు, సప్పా నానాజీల ఆధ్వర్యంలో రెండో రోజు జనం కోసం జనసేన కార్యక్రమం నిర్వహించారు. జనసేన పార్టీ నర్సీపట్నం నియోజకవర్గ ఇన్చార్జ్ రాజాన వీరసూర్యచంద్ర గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా జనసేన నాయకులకు గ్రామస్థులు సాధరంగా ఆహ్వానించి హారతులు పట్టారు. అనంతరం ప్రతీ గడపకు వెళ్లి సమస్యను అడిగి తెలుసుకున్నారు. దీంతో గ్రామస్థులు జనసేన నాయకులు పలు సమస్యలను ఏకరువు పెట్టారు. ముఖ్యంగా గ్రామంలో గ్రామంలో వ్యక్తిగత మరుగుదొడ్లు నోచుకోలేదని, పారిశుద్యం వ్యవస్థ అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. అలాగే జగనన్న ఇళ్ల స్థలాలు నేటికి మంజూరు చేయలేదని, ఇచ్చిన కాస్త ఇళ్లకు బిల్లులు ఇవ్వడం లేదని వీరి ముందు వాపోయారు. ఈ సందర్భంగా సూర్యచంద్ర మాట్లాడుతూ సీతన్నఅగ్రహారం గ్రామంలో పర్యటించినప్పుడు ప్రజలు ఎన్నో సమస్యలను తెలియజేయడం జరిగిందన్నారు. ప్రధానంగా మంచినీటి సమస్య అధికంగా ఉందన్నారు. జగనన్న లేఅవుట్ల లేదన్నారు. కట్టిన ఇళ్లకు కూడా బిల్లులు మంజూరు చేయలేదన్నారు. అధికారులకు ఎన్నిసార్లు తెలియజేసినా పట్టించుకోలేదని వాపోయారన్నారు. దీనిపై వారం రోజుల్లోగా సమస్యలను పరిష్కరించకపోతే గ్రామస్థులతో కలిసి ఆర్డీవో కార్యాలయం వద్ద ధర్నా చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నర్సీపట్నం మున్సిపాలిటీ అధ్యక్షులు అద్దేపల్లి గణేష్, మాకవరపాలెం మండల నాయకులు కర్రి సంతోష్, మున్సిపాలిటీ 13వ వార్డు ఇన్చార్జ్ గూడెపు తాతబాబు, జనసైనికులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com