ఉంగుటూరు ( జనస్వరం ) : ప్రభుత్వం తక్షణమే కళ్ళు తెరిచి ఆక్వారైతులను ఆదుకోవాలని డిమాండ్ చేస్తూ జనసేన పార్టీ ఉంగుటూరు నియోజవర్గం ఇంచార్జ్ ధర్మరాజు గారి ఆధ్వర్యంలో గురువారం గణపవరం గ్రామంలో పోలీస్ దిమ్మ దగ్గర నుండి ర్యాలీగా వెళ్లి ఎంఆర్‌ఓ గారికి వినతి పత్రం అందజేయడం జరిగింది. ఉభయ పశ్చిమ గోదావరి జిల్లాలో ఆక్వా రైతులు కష్టపడి పండించిన పంటను గిట్టుబాటు ధరకు కొనేవారు లేక తీవ్రంగా నష్టపోతున్నారు. పండిన పంటను అమ్ముకోవాలంటే దళారీల చుట్టు ప్రదక్షణ చేయవలసి వస్తుంది. మరో పక్క వాతావరణం అనుకులంగా లేకుండా వైరస్ ప్రభావంతో రైతులు నష్టాలకు గురవుతున్నారు. మేతల ధరలు ఒకపక్క పెరుగుతుంటే నాణ్యమైన సీడ్ లభించక నానా ఇబ్బందులు పడుతున్నారు పండిన పంటను ఎవరు కొనుగోలు చేయక పంటను కాపాడుకోలేక తక్కువ ధరకు దళరీలకు అమ్ముకోవలిసి వస్తుంది. విద్యుత్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించిన అమలు కావడం లేదు. సాగులో వున్న చేరువులన్నీటిని ఆక్వాజోన్ పరిధిలోకి తీసుకువచ్చి ప్రభుత్వ సబ్సిడీలు వచ్చేలా పంట సాగు చేసుకునే విధంగా వీలు కల్పించవలిసిందిగా జనసేన పార్టీ తరుపున కోరుతున్నామని అన్నారు. ఆక్వా రైతులకు అండగా అధికారులు కృషిచేయాలని కోరుతూ ఆక్వా రైతన్నల కోసం.
• ఆక్వా సాగు రొయ్యకు గిట్టుబాటు ధర వచ్చేలా చూడాలి
• విద్యుత్ సబ్సిడీ 1.50రూ లకే ఆక్వారైతులందరికీ సబ్సిడీ ఇవ్వాలి
• నాణ్యమైన సీడ్ లభించేలా చూడాలి.
• నాణ్యమైన మందులు రైతులకు అందేలా చూడాలి
• ప్రభుత్వం కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేసి ఆక్వా రైతులు తమ పంటను నిలువ చేసుకునే విధంగా సహకరించాలి.
• మేతల ధరలు తగ్గించాలి.
• రొయ్య ధరల స్థిరీకరణ మండలి ఏర్పాటుచేయాలి అని అన్నారు.
ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిలుగా జనసేన పార్టీ రాష్ట్ర పీఏసీ సభ్యులు కనకరాజు సూరి, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఘంటసాల వెంకటలక్ష్మి, భీమవరం పట్టణ అధ్యక్షులు చెనమల్ల చంద్రశేఖర్, తణుకు నియోజకవర్గ ఇన్చార్జ్ విడివాడ రామచంద్రరావు, ఏలూరు జనసేన పార్టీ ఇన్చార్జి రెడ్డి అప్పలనాయుడు, చింతలపూడి నియోజకవర్గ ఇన్చార్జ్ మేక ఈశ్వరయ్య, ఉండి నియోజవర్గం ఇంచార్జ్ జుత్తుగ నాగరాజు, జనసైనికులు, వీర మహిళలు, జనసేన నాయకులు ఆక్వా రైతులు పాల్గొన్నారు.