ఎమ్మిగనూరు ( జనస్వరం ) : పేరు గొప్ప ఊరు దిబ్బ అనే సామెతతో రాష్ట్ర ప్రభుత్వం జగనన్న కాలనీల్లో కనీస మౌలిక సదుపాయాలు కల్పించడంలో ఘోరంగా విఫలమైందని జనసేనపార్టీ ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇంచార్జి రేఖగౌడ్ ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తంచేశారు, జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు గోనెగండ్ల మండలంలోని జగనన్న కాలనీల దగ్గర అసంపూర్తిగా ఉన్నా గృహాలను పరిశీలించి ప్రభుత్వ తీరుపై విరుచుకుపడ్డారు, ప్రజలకు ఆశలు చూపి వరమిస్తానని చెప్పిన ముఖ్యమంత్రి మూడు కోరికల్లో ఏది కావాలో కోరుకోమని చెప్పిన మాట ఏమైందని ప్రశ్నించారు, మాట తప్పని ముఖ్యమంత్రి గృహాలను ప్రభుత్వమే నిర్మించి ఇస్తామని చెప్పిన మాట వాస్తవం కాదా అని గుర్తుచేశారు, ఇంటి నిర్మాణం చేపట్టే స్థోమత లేని పేద ప్రజలకు ఇంటి నిర్మాణం చేస్తారా లేక మీ పట్టాలు తిరిగి ఇస్తారా అనే భయాన్ని బాధితులకు ఎవరి ద్వారా బెదిరింపులు చేస్తున్నారో మీరు విన్నారా కనీసం మీరు ఉన్నారా అంటూ ఎద్దేవాచేశారు, కనీసం జగనన్న కాలనీల్లో ఇసుక,నీరు, విద్యుత్, సదుపాయలు లేనిదే ఇల్లు పూర్తి చేయడం సాధ్యమా అన్నారు, ముందు ఇసుక కొరతను నీటి వసతిని కల్పించాలని డిమాండ్ చేశారు, జగనన్న ఇళ్లు పేద ప్రజలకు కన్నీరు మాత్రమే మిగిల్చాయని అందుకే ఇంటి నిర్మాణాల కోసం అప్పులు చేసిన పేద ప్రజలు వలసల బాట పడుతున్నారని తెలిపారు,ఈ కార్యక్రమంలో జనసేనపార్టీ నాయకులు గానిగ బాషా, ఖాసీం సాహెబ్, మాలిక్, మునిస్వామి, రవికుమార్ సుబాన్, మాబాష,ఉపేంద్ర,మధు,ఈశ్వర్,మల్లి కార్జున, శంకర్, వెంకటేష్, పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com