Logo
Date of Publish : 28 November 2022, 2:46 pm
Editor : Sake Naresh

‘మాట’కు అందని అభిమానం : బధిర యువకుడు ఫణీంద్ర రూ. లక్ష విరాళం

    న్యూస్ ( జనస్వరం ) : స్పందించే మనసుకు మాట అవసరం లేదు.. అర్థం చేసుకునే హృదయానికి వినికిడి అవసరం లేదు. జనసేన పార్టీ ప్రయాణం ఆ మనసుకు అర్థమైంది… జనసేన అదినేత పవన్ కళ్యాణ్ కౌలు రైతులకు చేస్తున్న సహాయం ఆ మనసును తట్టి లేపింది. ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా అనపర్తి నియోజకవర్గం, పెదపూడి మండలం సంపర గ్రామానికి చెందిన తిబిరిశెట్టి వీర ఫణింద్ర బధిరుడు. పుట్టిన దగ్గర నుంచి ఎలాంటి ధ్వని వినిపించదు, మాట్లాడలేడు. వారిది చాలా పేద కుటుంబం, ఇంట్లోని వారంతా కూలీ పనులు చేస్తున్నారు. అయినా ఫణీంద్ర సంకల్పం చేసుకుని మరీ ఉద్యోగం చేస్తూ.. వచ్చిన డబ్బును రూపాయి, రూపాయి పొదుపు చేసి దాచాడు. అతడి మనసుని తాకిన జనసేన పార్టీ సిద్ధాంతాల కోసం ఏదైనా చేయాలని అనుకున్నాడు, పార్టీ చేపట్టిన కౌలు రైతు భరోసా యాత్రకు తన వంతు సహాయంగా దాచుకున్న సొమ్మును ఇవ్వాలని భావించాడు. జనసేన పార్టీ కోసం దాచిన రూ.లక్ష చెక్ ను ఆదివారం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ కు మంగళగిరి పార్టీ కార్యాలయంలో అందించారు. ఫణింద్ర గొప్ప మనసు పవన్ కళ్యాణ్ ను కదిలించింది.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com