
ఆమదాలవలస, (జనస్వరం) : ఆమదాలవలస నియోజకవర్గంలో జనసేన పార్టీ నాయకులు కొత్తకోట నాగేంద్ర, కోరుకొండ మల్లేశ్వరరావు, అంపిలి విక్రమ్(ఎంపీటీసీ) ఆధ్వర్యంలో జనంతో – జనసేన కార్యక్రమంలో భాగంగా ఐదవ రోజు రామన్నపేట గ్రామంలో ప్రతి ఇంటింటికి వెళ్లి జనసేన సిద్ధాంతాలను వివరించడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రానికి రాజధాని లేదు. రాష్ట్రంలో జాబులు కల్పించలేకపోవడం వల్ల రోజురోజుకీ నిరుద్యోగులు పెరిగిపోతున్నారు. యువత అందరకి కూడా జాబులు రావాలి, మన రాష్ట్రం అభివృద్ధి చెందాలి అంటే భవిష్యత్తులో వచ్చే ఎన్నికల్లో జనసేన పార్టీని ఆదరించి గాజు గ్లాస్ గుర్తుకి ఓటు వేసి జనసేన పార్టీని గెలిపించవలసిందిగా ప్రతి ఒక్కరిని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ నాయకులు ధూబా సంఘం నాయుడు, సేపన రమేశ్, కొత్తకోట శ్రీను, అనిల్ జనసేన కార్యకర్తలు, గ్రామ ప్రజలు పాల్గొని విజయవంతం చేసినందుకు ప్రతి ఒక్కరినీ పేరు పేరునా ధన్యవాదాములు తెలియజేసుకుంటున్నామని తెలిపారు.