Logo
Date of Publish : 03 May 2022, 4:40 pm
Editor : Sake Naresh

పేద ముస్లిం కుటుంబాలకు రంజాన్ తోఫా అందించిన ఉండ్రాజవరం జనసేన నాయకులు

     ఉండ్రాజవరం, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా నిడదవోలు నియోజకవర్గంలోని ఉండ్రాజవరం మండలంలో చిలకపాడు గ్రామంలో రంజాన్ సందర్భంగా జనసేనపార్టీ తరఫున గొడే రమేశ్  ఆధ్వర్యంలో ముస్లిం సోదర సోదరీమణులకు ( 30 కుటుంబాలకు ) రంజాన్ తోఫా ఇవ్వటం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి శ్రీమతి ప్రియా సౌజన్య మాట్లాడుతూ నెల రోజుల పాటు ఎంతో నిష్టతో ఉపవాస దీక్షలు చేపట్టిన ముస్లిం సోదర, సోదరీమణులకు హృదయపూర్వక రంజాన్ శుభాకాంక్షలు అందజేస్తూ, ఆ అల్లా చల్లని దీవెనలతో అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాని అన్నారు. ఈ సందర్భంగా జనసేనపార్టీ మండల అధ్యక్షులు వీరమళ్ళ బాలాజీ మాట్లాడుతూ కులమతాలకు అతీతంగా, అధికారంతో పని లేకుండా చిలకపాడు గ్రామంలో ప్రజల ప్రతి కష్టానికి మేమున్నాం అంటూ జనసైనికులు తమకు తోచినంతలో సహాయము చేస్తున్నారన్నారు. అలాగే రంజాన్ తోఫా పంపిణీ కార్యక్రమంలో ఇంటింటికీ వెళ్తున్నప్పుడు sk మస్తాన్ గారికి ఇరవై రోజుల క్రితం ప్రమాదవశాత్తూ మోచెయ్యి ఫ్రాక్చర్ అయిన విషయం తెలుసుకుని అప్పటికప్పుడు జనసేన పార్టీ తరఫున 2000 రూపాయలు ఆర్ధిక సహాయం చేసి, వాళ్లకి పార్టీ తరఫున ఎటువంటి సహాయం కావాలన్న చెయ్యటానికి సిద్ధం అని హామీ ఇవ్వడం జరిగింది. ఈ కార్యక్రమంలో జిల్లా సంయుక్త కార్యదర్శి సాదా వెంకట్, పందలపర్రు జనసెన నాయకులు ANR, కర్రి వినోద్ కుమార్, గరిమెళ్ళ కొండలరావు, ఇంటి వెంకట్, కైగాల ప్రసాద్, హనుమంతు పండు, ఇర్రి మోహనకృష్ణ, నిమ్మకాయల మణికంఠ, చిలకపాడు జనసైనికులు భగవాన్, సురేష్ చిమ్మా, కార్తీక్ చండిక, తేజ చెల్లింకి, మణికంఠ, పవన్ అడ్డా, లాలి భాషా sk పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com