పిఠాపురం ( జనస్వరం ) : పలువురు మహిళలు జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ ఆశయాలననుసరించి పిఠాపురం జనసేన పార్టీ ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ ఆధ్వర్యంలో పార్టీలోకి చేరారు. జనసేన పార్టీ పిఠాపురం ఇంచార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ పిఠాపురం పట్టణ కార్యాలయంలో జనసేన పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు. ఈ సందర్భంగా పిఠాపురం నియోజకవర్గంలోని కొత్తపల్లి మండలంలో ఉన్న ఉప్పాడ, అమరవిల్లి, కొత్తపల్లి, సుబ్బంపేట, రంగంపేట, పల్లిపేట వంటి ప్రాంతాలకు చెందిన మహిళలు తంగెళ్ళ సమక్షంలో చేరి వారి ఆనందాన్ని పంచుకున్నారు. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ మహిళలు పట్ల చూపే గౌరవం, ఆప్యాయత ఎంతగానో తమకు నచ్చిందని, అందువల్ల జనసేన పార్టీలో చేరినట్లు వారు చెప్పారు. నియోజవర్గంలో పార్టీ పట్ల రోజు రోజుకీ ప్రజా విశ్వాసం పెరుగుతుందని మహిళలు భారీగా జనసేనలో చేరడం పట్ల ఆనందం వ్యక్తం చేస్తున్నామన్నారు. పార్టీలో వీర మహిళలకు అధిక ప్రాధాన్యత, ప్రత్యేక స్థానం ఉంటుందని ఉదయ్ వారితో చెప్పారు. ఈ సందర్భంగా వారు పార్టీ అప్పగించిన పనిని చేసేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. పార్టీ అవసరాలకు, ప్రజాహిత కార్యక్రమాలకు తాము స్వచ్ఛందంగా హాజరై విజయవంతం చేస్తామని తంగెళ్ళకు వారు బదులిచ్చారు. జనసేన పార్టీలో చేరిన వారిలో ఉమ్మిడి అమలేశ్వరి, దల్లి అపర్ణ, కేశం దుర్గ, చొక్కా కొయ్యమ్మ, కొనమర్తి మార్త, అడ్డాల దుర్గ, పలివెల సరస్వతితో పాటు దొడ్డి దుర్గాప్రసాద్ తదితరులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com