* బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుంటే.. నిరాశ్రయలo అవుతాం ..!
* సరుబుజ్జిలి మండలం అమృత లింగా నగరం రైతులు ఆవేదన.
* జనసేన పార్టీ నియోజకవర్గ ఇంచార్జ్ పేడడా రామ్మోహన్ రావు ఆధ్వర్యంలో ఆరు గ్రామాల రైతులు కలిసి కలెక్టర్ కు ఫిర్యాదు.
ఆముదాలవలస ( జనస్వరం ) : సరుబుజ్జిలి మండలం బొప్పడం పంచాయతీ పరిధిలో అమృత లింగానగరం గ్రామపరిది జగనన్న కాలనీ వద్ద వంశధార నాగావళి అనుసంధాన కాలువ పనులు వద్ద జంబాడ రోడ్డును కాలువ క్రాస్ అవ్వడంతో అక్కడ రోడ్డును తవ్వేస్తామని అధికారులు సన్నాయి అవడంతో అక్కడ బ్రిడ్జి లేకపోతే ఆరు గ్రామాలు రైతులు నిరాశ్రయులు అవుతామని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఆరు గ్రామాల రైతులతో జనసేన పార్టీ ఆమదాలవలస నియోజకవర్గ ఇన్చార్జ్ పేడాడ రామ్మోహన రావు ఆధ్వర్యంలో రైతులతో కలిసి శ్రీకాకుళం జిల్లా కలెక్టర్ కు, ఇరిగేషన్ శాఖ సూపరిండెంట్ ఆఫ్ ఇంజినీర్ వారికిస్పందనలో ఫిర్యాదు చేశారు. వివరాలు లోకి వెళ్తే అదే రోడ్డు వద్ద వంశధార నాగావళి అనుసంధా కాలువ పనులు సుమారు 200 మీటర్ల గత ఆరు సంవత్సరాలుగా ఆగిపోయాయి, అందుకు కారణం కొందరు రైతులు భూములకు పరిహారం చాలుదంటూ కోర్టుకు వెళ్లడం వల్ల పనులు ఆగిపోయాయి. అదే ప్రాంతంలో సరుబుజ్జి నుంచి జాంబాడ, మురగడ, బూచేంద్రి మీదుగా కడగండి పోవుటకు 40 అడుగుల వెడల్పుతో ప్రధాని రహదారి ఉంది. ఈ రహదారి వలన బొప్పడం, అమృత లింగా నగరం గ్రామాలకు చెందిన రైతులకు సుమారు 500 ఎకరాల వ్యవసాయ సేద్య భూములు కొండకు అనుకోని ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ సంవత్సరం ఆగస్టు నెలలోగా వంశధార నాగావళి అనుసంధకాలువ పనులు పూర్తిచేసి నీరు అందించాలని రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి స్థానికంగా ఏమైనా సమస్యలు ఉంటే వెంట వెంటనే పరిష్కారం చేసి, రైతులతోమాట్లాడి ఒప్పించేలా ఉన్నతాధికారులకు, స్థానిక నియోజకవర్గం ఎమ్మెల్యేలకు చెప్పడంతో ప్రస్తుతం ఆ పనులు గత రెండు రోజులుగా ప్రారంభం చేశారు. ఇరిగేషన్ శాఖ అధికారులు గురువారం వచ్చి పనులను పరిశీలించి, రోడ్డుపై ఎటువంటి బ్రిడ్జి లేదని దాని తవ్వేస్తామని, ఈ ప్రదేశంలోనే వంశధార నాగావళి అనుసంధాన కాలువ క్రాసింగ్ అవుతుందని,వారు అక్కడే ఉన్న కొందరు స్థానిక రైతులకు తెలుపడం తో వారు ఒక్కసారి ఆడ్ చేయడానికి గురయ్యారు. ఈ విషయాన్ని గ్రామస్తులకు చేరవేశారు.ఈ క్రాసింగ్ వద్ద బ్రిడ్జ్ కడతారని ఇంతవరకు స్థానిక ప్రజలు అనుకున్నారు, ఇప్పుడు ఒక్కసారిగా అధికారులు లేదని చెప్పడంతో వారిలో ఆందోళన మొదలై సుమారు 200 పైగా గ్రామప్రజలు అక్కడకు చేరుకొని, బ్రిడ్జి లేకపోతే పనులు జరగనివ్వమని అడ్డుకున్నారు. దీంతో అక్కడే ఉన్న, ఇరిగేషన్ అధికారులు, కాంట్రాక్టర్ తో వారికి మధ్యకొంత సంఘర్షణ జరిగింది. దీంతో వారు పనులు ఆపివేసి, ఈ విషయాన్ని ఫోన్లో ఉన్నత అధికారులకు తెలియపరిచారు. వారంతా అక్కడే కూర్చుని బ్రిడ్జి నిర్మాణం చేపట్టాలని నినాదాలు చేస్తూ సుమారు ఐదు గ్రామాలకు చెందినటువంటి ప్రజలు తీర్మానం చేసి సంతకాలతో కూడిన దరఖాస్తులను తయారు చేశారు. వీటిని కలెక్టర్ గారికి, సూపర్డెంట్ ఆఫ్ ఇంజనీర్ ఇరిగేషన్ వారికి, స్థానిక ఎమ్మెల్యే కు సంతకాలతో కూడిన దరఖాస్తును సోమవారం ఇస్తామని తెలిపారు. జాంపాడు రోడ్డు క్రాసింగ్ వద్ద బ్రిడ్జి నిర్మాణం చేపట్టకుండా అధికారులు పనులు ముందుకు వెళితే అన్ని గ్రామాల ప్రజలు వచ్చి పనులు అడ్డుకొని,నివాసం ఏర్పాటు చేసుకుంటామని వారికి తెలిపారు. మా అభ్యర్థన మన్నించి బ్రిడ్జి ని నిర్మించాలని, రోడ్డును తొలగించి గెడ్డను తవ్వితే వ్యవసాయ భూములకు, కొండల్లో ఉండేటువంటి పోడు వ్యవసాయం, పండ్ల, కూరగాయలు తదితవిధ ఆహార పదార్థాలు మార్కెట్ కు తెచ్చుటకు మార్గం ఉండదని దీంతో మేమంతా నిరాశ్రయులము అవుతామని మా ఆవేదనను అధికారులు, అధికార పార్టీ నాయకులు గుర్తించి, బ్రిడ్జి నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకోవాలని ముక్తకంఠంతో వారంతా వారిని అభ్యర్థించారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ సరుబుజ్జిలి మండల అధ్యక్షుడు పైడి మురళి మోహన్, ఆమదాలవలస మండల నాయకులు వీరఘట్టపు బాల మురళి, తవిటినాయడు,పూజారి యశ్వంత్ కుమార్, ఆరు గ్రామాల ప్రజలు భూషణం,కోటి,అప్పలనాయుడు, జనార్ధన్, తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com