
పాలకొండ, (జనస్వరం) : పాలకొండ మండలం లుంబూరు గ్రామంలో జనసేనపార్టీ పాలకొండ నియోజకవర్గ నాయకులు గర్భన సత్తిబాబు గడప గడపకు జనసేనపార్టీ సిద్ధాంతాలు, మేనిఫేస్టో వివరించడం జరిగింది. అలానే గ్రామంలో పలు సమస్యలను తెలుసుకొని అధికార, ప్రతిపక్ష పార్టీ వైఫల్యాలని ప్రజలకు తెలియజేస్తూ వచ్చే ఎన్నికల్లో జనసేనపార్టీకి ప్రతి ఒక్కరు సపోర్ట్ చేయాలని మీ అమూల్యమైన ఓటును గాజు గ్లాస్ గుర్తుపై వేసి జనసేనపార్టీని అధికారంలోకి తీసుకురావాలని జనసేన పార్టీతోనే వెనుకబడిన ఆంధ్ర రాష్ట్రం అభివృద్ధిలోకి వస్తుందని రేపటి పిల్లల భవిష్యత్తు దృష్టిలో పెట్టుకొని పవన్ కళ్యాణ్ లాంటి నాయకుడిని మనం గెలిపించుకోవాలని ఈ సందర్భంగా తెలియచేశారు. ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు, జనసైనికులు పాల్గొన్నారు.