Logo
Date of Publish : 16 March 2024, 7:38 pm
Editor : Sake Naresh

డా హరిప్రసాద్ ఆధ్వర్యంలో “అరణి శ్రీనివాసులుకు అపూర్వ స్వాగతం

     తిరుపతి, (జనస్వరం) : తిరుపతిలో జనసేన, టీడీపీ, బీజేపీ ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులుకు ప్రజలు బ్రహ్మరధం పట్టారు. జనసేన పార్టీ ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ ఆధ్వర్యంలో సింగాల గుంటలో శనివారం తిరుపతి ఉమ్మడి అభ్యర్థి అరణి శ్రీనివాసులు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్బంగా అభ్యర్థి అరణి శ్రీనివాసులు మాట్లాడుతూ ఆధ్యాత్మిక నగరం తిరుపతిని అభివృద్ధి బాట పట్టించాలంటే తమను గెలిపించాలని కోరారు. తమ అధినేత పవన్ కళ్యాణ్ రాష్ట్ర అభివృద్ధి కాంక్షించి టీడీపీ, బీజేపీలతో కలిసి రాష్ట్రంలో రాక్షస పాలన అంతానికి పూనుకున్నారన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లా అధ్యక్షులు డా పసుపులేటి హరిప్రసాద్ మాట్లాడుతూ తమ పార్టీ అధినేత ప్రజల బాగుకోసం మాత్రమే కొన్ని మెట్లు తగ్గారన్నారు. ఉమ్మడి అభ్యర్థి విజయమే రాష్ట్రంలో ఆరాచక పాలనకు చరమగీతం పాడుతుందన్నారు.తమ అధినేత పవన్ కళ్యాణ్ నిర్ణయమే తమకు శిరోధార్యం అన్నారు. అధినేత నిర్ణయించిన వ్యక్తిని తిరుపతి నుంచి గెలిపించి కానుకగా ఇస్తామన్నారు ఈ కార్యక్రమంలో స్థానిక నాయకులు చందు, రాజేష్ యాదవ్, భాను, కృష్ణయ్య, ఆనంద్, కుమార్, దిలీప్ సుబ్రహ్మణ్యం, మధులత, దివ్య, శిరీష, లక్ష్మి, కోకిల, జయంతమ్మ, జనసైనికులు, వీరమహిళలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com