
మంగళగిరి, (జనస్వరం) : మంగళగిరి నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయంలో తాడేపల్లి మండలంలోని పెనమాక గ్రామం నుంచి పవన్ కళ్యాణ్ ఆశయాలు నచ్చి తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరరావు ద్వారా మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాస రావు ఆధ్వర్యంలో పలువురు జనసేన పార్టీలోకి చేరడం జరిగింది. వారందరికీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. ఈ సందర్భంగా పెనుమాక జనసైనికులు మాట్లాడుతూ వైసిపి – టిడిపి పార్టీ నుంచి జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సిద్ధాంతాలు నచ్చి జనసేన పార్టీలో చేరామని, పార్టీ బలోపేతానికి మా వంతు కృషి చేస్తామని మనస్ఫూర్తిగా తెలియజేశారు. పెనుమాక గ్రామ నాయకులు B.బాబురావు
శ్యామ్ ల ఆధ్వర్యంలో Sk.భాష, B.శివగోపాలం, k.జంపారావు, M.సురేష్, k.కృష్ణ, Ch.రోశయ్య, P.ఈసా, A.స్వామి, అశోక్, B. మేరి బాబు తదితరులు పార్టీలోకి చేరారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి బేతపూడి విజయ్ శేఖర్, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం ప్రధాన కార్యదర్శి పర్వతం మధు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం సాంబశివరావు, జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ సమన్వయ కమిటీ సభ్యులు దాసరి శివ నాగేంద్రం, మంగళగిరి-తాడేపల్లి జనసేన పార్టీ కోఆర్డినేటర్ వెంకట మారుతీ రావు, మంగళగిరి మండల అధ్యక్షుడు వాసా శ్రీనివాసరావు, జనసేన పార్టీ సీనియర్ నాయకులు చిట్టెం అవినాష్, యర్రపాలెం గ్రామ జనసేన నాయకులు సుందరయ్య, మంగళగిరి మండల జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ సాయి నందన్, తాడేపల్లి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ అధ్యక్షులు మేకల సాయి, చంద్రశేఖర్, రత్నాల చెరువు జనసైనికులు కమేష్, గోపి, శివ చీరాల జనసైనికులు కర్ణ కిరణ్ తేజ, పసుపులేటి సాయి, దేవన సంతోష్, బాల గోపికృష్ణ తదితరులు పాల్గొన్నారు.