Logo
Date of Publish : 26 September 2022, 3:44 pm
Editor : Sake Naresh

చిల్లపల్లి శ్రీనివాసరావు ఆధ్వర్యంలో జనసేన పార్టీలోకి పలువురు యువకులు చేరిక

     మంగళగిరి, (జనస్వరం) : మంగళగిరి పట్టణం, రత్నాల చెరువులో పలు పార్టీలకు పనిచేసిన యువత ఈరోజు జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గ కార్యాలయంలో మంగళగిరి నియోజకవర్గ ఇంఛార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు సమక్షంలో పార్టీలో చేరడం జరిగింది. ఈ సందర్భంగా శ్రీనివాసరావు పార్టీ కండువాలు కప్పి వారిని సాదరంగా జనసేన పార్టీలోకి ఆహ్వానించడం జరిగింది. తదనంతరం చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ పలు పార్టీల్లో పనిచేసిన యువత ఈ రోజున జనసేన పార్టీ సిద్ధాంతాలు, జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ భావజాలం నచ్చి జనసేన పార్టీలో చేరడం జరిగిందని, నేడు ఆంధ్ర రాష్ట్రం చూస్తుంటే ఏ పార్టీలోనూ లేనివిధంగా జనసేన పార్టీలోనే ఎక్కువగా యువత చేరుతున్నారని, రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేస్తూ, పవన్ కళ్యాణ్ ఆంధ్ర రాష్ట్ర సీఎం అయ్యే విధంగా, మంగళగిరి నియోజకవర్గంలో పార్టీ గెలుపు కోసం అందరం కలిసికట్టుగా కృషి చేయాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో మంగళగిరి-తాడేపల్లి మున్సిపల్ కార్పొరేషన్ జనసేనపార్టీ కోఆర్డినేటర్ వెంకట మారుతీరావు, జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం కార్యదర్శి జంజనం వెంకట సాంబశివరావు (JSR), మంగళగిరి మండల అధ్యక్షులు వాసా శ్రీనివాసరావు, మంగళగిరి మండల సంయుక్త కార్యదర్శి సుంకర సాంబశివరావు, మంగళగిరి పట్టణ జనసేన పార్టీ సోషల్ మీడియా కోఆర్డినేటర్ జొన్నాదుల పవన్ కుమార్, చిల్లపల్లి యూత్ ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్, యర్రబాలెం గ్రామ నాయకులు, సుందరయ్య జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com