Logo
Date of Publish : 23 December 2022, 12:48 pm
Editor : Sake Naresh

అనంత జనసేన నాయకులు భవానీ రవికుమార్ ఆధ్వర్యంలో అన్నదాతలకు ఘన సత్కారం

         అనంతపురం ( జనస్వరం ) : జనసేన పార్టీ అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు మరియు PAC మెంబర్ నాగబాబు గారి పిలుపు మేరకు ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు జరిగాయి. జనసేన రాష్ట్ర కార్యనిర్వహణ ప్రధాన కార్యదర్శి భవానీ రవికుమార్ మాట్లాడుతూ ఎంతో మందికి కడుపునిండా అన్నం పెట్టే రైతున్నలు సరైన గిట్టు బాటు ధరలు లేక పురుగుల మందును, పెరుగన్నం అనుకొని మింగేస్తున్నారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా ఎంతోమంది నాయకులు మారినా రైతన్నలకు న్యాయం జరగడం లేదన్నారు. ఇటీవల కాలంలో చూసుకుంటే ఒక్క ఆంధ్రప్రదేశ్ లోనే 3000 వేల మందికి పైగా కౌలు రైతులు ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనతో జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ గారు చలించిపోయి వారికి అండగా నేను ఉన్నా అంటూ చనిపోయిన ప్రతి రైతు కుటుంబానికి లక్ష రూపాయల ఆర్థిక సాయం అందిస్తున్నారన్నారు. రాబోయే 2024 ఎన్నికల్లో రైతు ప్రభుత్వం జనసేన పార్టీ అధికారంలోకి రాగానే రైతులకు బాధిత రైతు కుటుంబాలకు న్యాయం జరుగుతుంది అని తెలియజేశారు నిజమైన రాజు రైతే అని కొనియాడారు. కార్యక్రమం అనంతరం భవానీ రవికుమార్ ఆధ్వర్యంలో అన్నదాతలకు ఘన సత్కారం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా నాయకులు గల్లా హర్ష, జిల్లా కార్యదర్శి సంజీవ రాయుడు, కార్యక్రమాల కమిటీ సభ్యులు SKU రమణ, నగర ప్రధాన కార్యదర్శి రోళ్ల భాస్కర్, కమటం వెంకట నారాయణ, కార్యదర్శులు TN అంజి, ఆకుల ప్రసాద్, కార్య క్రమాలు కమిటీ సభ్యులు, మధు, చిన్నా, సంతోష్, జిల్లా యువనయకులు సంపత్ రాయల్,  నవీన్, చంద్ర శేఖర్, సాయి, రైతులు కొండయ్య, పేట రామకృష్ణ, నారాయణస్వామి, ఏర్రి నగప్ప, పెద్దన్న, రామ చంద్ర రెడ్డి, సురేష్, భాస్కరయ్యా, గోపాల్, దాసరి నిర్మల, ప్రమీల, ఫరీద, లక్ష్మీదేవి, సలక్క , భగ్యమ్మ , సావిత్రి, అర్చన, ఒబులమ్మ, పద్మావతి, అలివేలు, నీలాంబరి సుగుణ  తదితరులు పాల్గొన్నారు. 


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com