
ఉదయగిరి ( జనస్వరం ) : సీతారామపురం మండలం పరిధిలోని మారంరెడ్డిపల్లి కాలనీ నుండి సీతారామపురం వెళ్లే మార్గంలో రోడ్డు కనపడకుండా కంప చెట్లు పెరగడం వలన తరచూ వాహనదారులు ప్రమాదానికి గురవుతున్నారు. గ్రామ ప్రజలు పంచాయితీ దృష్టికి తీసుకెళ్లగా వారు పంచాయతీ నిధులు లేవని పని చేయించలేమని చెప్పడంతో ఈ విషయాన్ని జనసేన పార్టీ నియోజకవర్గ నాయకులు భోగినేని కాశీరావు గారి దృష్టికి తీసుకెళ్లారు. కాశీరావు గారు స్పందిస్తూ రోడ్డుకి ఇరువైపులా ఉన్నటువంటి కొంప చెట్లను సుమారు 8 గంటల పాటు JCB ని ఏర్పాటు చేసి పూర్తిగా తొలగించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని చూసి గ్రామ ప్రజలు, వాహనదారులు ప్రభుత్వం చేయలేని పనిని జనసేన పార్టీ ద్వారా చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ నాయకులు జిల్లా కార్యదర్శి ఆల్లూరి రవీంద్ర, జనసేన నాయకులు శ్రీనివాసులు, లక్ష్మణ్ , జనసైనికులు మరియు గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు