
కామేష్ రామకుర్తి ఆధ్వర్యంలో ఒమ్మంగి గ్రామంలోని వృద్ధులకు నిత్యావసర సరుకులు పంపిణీ చేసిన జనసైనికులు
ప్రజా నాయకుడు, బడుగు బల హీన వర్గాల ఆశాజ్యోతి, జనసేన పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మ దిన వేడుక సందర్భంగా తూర్పు గోదావరి జిల్లా, ప్రత్తిపాడు మండలం,ఒమ్మంగి గ్రామంలోని వృద్ద, ఒంటరి వ్యక్తులకు నిత్యావసర వస్తువుల ను కామేష్ రామకుర్తి గారి ఆధ్వర్యంలో పంచడం జరిగింది, కామేష్ రామకుర్తి గారు మాట్లాడుతూ జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి జన్మదిన సందర్భంగా వృద్ధ, ఒంటరి మహిళలకు నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం ఆనందంగా ఉందని అన్నారు. పవన్ కళ్యాణ్ గారి ఆశయ సాధనలో నడుస్తూ ఆయన స్ఫూర్తిని మరింత ముందుకు తీసుకెళ్లెలా చూస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో ఒమ్మంగి జనసైనికులు, గ్రామస్తులు తదితరులు పాల్గొనడం జరిగింది.