
ప్రజాసమస్యల పోరాటానికై “జనంలోకి జనసేన “కార్యక్రమంలో భాగంగా ఒంగోలు నగరంలోని 16వ డివిజన్ నందు జనసేన నాయకులు పర్యటించి స్థానికంగా ఉన్న సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రధానంగా రైల్వే గేట్ వేసినప్పుడు ఎక్కువ సమయం మూసి ఉంచడం వలన అత్యవసర పరిస్థితుల్లో ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని అధికారుల దృష్టికి తీసుకెళ్లిన వారు పట్టించుకోవడంలేదని వాపోయారు. అలాగే స్థానికంగా పారిశుధ్య సమస్య తీవ్రంగా ఉన్నదని, కాలువలు సరిగా లేకపోవటం వల్ల ఇళ్లలోనుంచి వచ్చిన మురుగునీరు వెళ్లే దారి లేక దుర్వాసన రావటమే కాకుండా దోమలు అధికంగా ఉన్నాయని, స్థానిక నాయకులకు చెప్పిన ఈరోజు వరకు పట్టించుకున్న నాధుడే లేడని గెలిచిన కార్పొరేటర్ కూడా ఎన్నికల సమయం లో ఓట్లడగటానికి వచ్చాడు తప్పా ఇప్పుడైనా కనీసం పట్టించుకున్న దాఖలా లేదని ఆవేదన వ్యక్తం చేశారు. సానిటైజేషన్ ప్రక్రియ సరిగా జరగటం లేదని మంచి నీరు కూడా నిర్ణిత సమయం లేకుండా ఎప్పుడు పడితే అప్పుడు వదులుతున్నారని, అదికూడా సరిపడా నీరు రాకపోవడంతో అనేక ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ముఖ్యంగా ఈ కాలనిలన్ని ఏర్పడి 25 సంవత్సరాలు అవుతున్న, ఇప్పటికి మరణించిన వారికి దహన సంస్కారాలు చేయుటకు స్మశానవాటికకు ఇప్పటివరకు స్థలము కేటాయించలేదని వారు చెప్పారు. ఈ సమస్యలపై స్పందించిన జనసేన నాయకులు మాట్లాడుతూ అక్కడి సమస్యల పరిష్కారానికి ఒంగోలు జనసేన పార్టీ పార్లమెంటు ఇంఛార్జ్ శ్రీ షేక్ రియాజ్ గారి ఆధ్వర్యంలో సమస్యలన్నింటిని ఉన్నత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి ప్రజలతరుపున పోరాడి పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో పిల్లి రాజేష్,బండారు సురేష్, ఈదుపల్లి గిరి, చెరుకూరి ఫణి, ఈదుపల్లి మణి, రమేష్, పోకల నరేంద్ర, టంగుటూరి శ్రీను, కిషోర్, అవినాష్, ప్రసాద్, సుధాకర్,యూ.మోహన్,ఇర్ఫాన్,వీరమహిళలు ప్రమీల, కోమలి రాయపాటి అరుణ గారు తదితరులు పాల్గొన్నారు.