Logo
Date of Publish : 02 January 2024, 8:56 pm
Editor : Sake Naresh

జగన్ పాలనలో మహిళలుకు రక్షణ కరువు

 విశాఖపట్నం ( జనస్వరం ) : శాంతి నగరంగా పేరున్న విశాఖ.. నేడు వైసిపి పాలనలో ఆశాంతికి అడ్డాగా మారిపోతుందని ఈ రోజు సాయంత్రం 4 గంటలకు పౌర గ్రంధాలయంలో జరిగిన మీడియా సమావేశంలో జనసేన పార్టి PAC సభ్యులు కోన తాతారావు అన్నారు. పోయిన నెల 18తేదీన విశాఖ లో మైనర్ బాలికపై జరిగిన గ్యాంగ్ రేప్ వైసిపి ప్రభుత్వం యొక్క వైపల్యమని,శాంతి భద్రతల పై సీఎం సమత్సరానికి ఒక్క సారైనా సమీక్ష చేయుకపోవటం, ప్రాధన్యత లేని అంశంగా చూడటం వలనే నగరంలో కాకుండ రాష్ట్రంలో మహిళలపై మునుపెన్నడు జరగనన్ని గ్యాంగ్ రేప్ లు, అగాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. వైసిపి 4సంత్సరాల 7నెలలు పాలనలో ఒక్క విశాఖ లో 42గ్యాంగ్ రేప్ లు నమోదయ్యాయని, రాష్ట్రంలో మహిళలుపై విమెన్ ట్రాఫికింగ్, గ్యాంగ్ రేప్ లు, ఇతర ఆగాయిత్యాలు తో 25'503 పైగా కేసులు నమోదయ్యాయని, ఒక్క విశాఖలోనే 2023 సంత్సరంలో 1325 కేసులు నమోదవటం జగన్ రెడ్డి పాలనలో పోలీస్ వ్యవస్థ వైపల్యం కాంబడుతుందని ఏద్దేవా చేసారు. పోలస్ వ్యవస్థ ప్రజలకు కాకుండ అధికార పార్టి నేతల కనుసన్నాల్లో పనిచేయడం మానుకోకపోతే భవిష్యత్తులో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొనే పరిస్థితులు తెచ్చు కోవద్దన్నారు. నగర పోలీస్ కమీషనర్ ప్రత్యేక దృష్టి పెట్టకపోతే ఇప్పటికే గంజాయి, డ్రగ్స్ కు అడ్డాగా మారుతున్నా ఈ నగరంలో మరింత క్రైమ్ రేటు పెరుగుపోతుందని హెచ్చరించారు. విశాఖ నార్త్ ఇంచార్జి శ్రీమతి పసుపులేటి ఉషాకిరణ్ మాట్లాడుతూ మహిళల రక్షణకు సీఎం జగన్ రెడ్డి 4ఏళ్లుగా చెపుతున్న దిశా చట్టం అడ్రస్ లేకుండా పోయిందన్నారు. ఈ సమావేశంలో జీవీఎంసీ jsp ఫ్లోర్ లీడర్ భీశెట్టి వసంత లక్ష్మి, మహిళా రీజినల్ కో ఆర్డినేటర్లు లక్ష్మి చౌదరి, శారని దేవి, కిరణ్ ప్రసాద్, త్రివేణి, కళ తదితరులు పాల్గొని మాట్లాడారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com