గుంతకల్ ( జనస్వరం ) : గుత్తి మండలంలోని బేతాపల్లి, యంగన్నపల్లి, ఊటకళ్ళు, గ్రామాలకు వెళ్లే రహదారి గోతులు పడి శిథిలావస్థకు చేరుకుంది రాత్రిళ్లు గ్రామాల్లో ప్రమాదాలు జరిగినప్పుడు అనారోగ్యం బారిన పడినప్పుడు హుటాహుటిన పట్టణానికి చేరాలంటే ఆంబులెన్స్ రావడానికి సుమారు గంట సమయం పడుతుందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిన్నగాక మొన్న రోడ్డు శిథిలావస్థకు చేరుకున్న ఈ రహదారిలో నిత్యం ప్రయాణికులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు చూసి ఆటో డ్రైవర్ల స్పందించి ఒక్కొక్కరూ 2 వేల చొప్పున చందాలు వేసుకొని గుంతలు పూడ్చారు. చాలాసార్లు అధికారులు, ప్రజా ప్రతినిధులు విన్నవించుకున్నా పట్టించుకోలేదని స్థానికులు చెబుతున్నారు. ప్రభుత్వం వాహనమిత్ర పేరుతో ఇస్తున్న 10 వేలు ఆటో మరమ్మతులు కూడా చాలడం లేదు. మా గ్రామానికి సరైన రహదారి నిర్మిస్తే చాలు అని ఆటో డ్రైవర్లు మాతో మొర పెట్టుకుంటున్నారు, పెట్రోలు డీజిల్ పై సెస్ పేరుతో వందల కోట్లు ప్రభుత్వం దండుకోవడం కాదు, ఇలా శిథిలావస్థకు వచ్చిన రోడ్లు బాగు పై కూడా కాస్త దృష్టి సారించాలని ఇప్పటికైనా గాఢనిద్రలో ఉన్న ముఖ్యమంత్రి, శాసనసభ్యులు నిద్రలేచి జనసేన పార్టీ లేవనెత్తిన సమస్యని హుందాగా స్వీకరించి ఈ రహదారికి శాశ్వత మరమ్మతులు చేయాలని జనసేన నాయకులు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ గుత్తి మండల అధ్యక్షుడు చిన్న వెంకటేశులు, గుత్తి పట్టణాధ్యక్షుడు పాటిల్ సురేష్, జిల్లా కార్యనిర్వాహక కమిటీ సభ్యుడు పవర్ శేఖర్, జనసేన నాయకులు సుబ్బయ్య, నంద, వెంకటపతి నాయుడు, ఆటో రామచంద్ర, ఓబిలేసు, గద్దల కార్తిక్, జయరాజ్, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.