
మంగళగిరి ( జనస్వరం ) : ఉండవల్లి గ్రామంలో తాడేపల్లి మండల అధ్యక్షులు సామల నాగేశ్వరావు గారి ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన జనసేన పార్టీ గ్రామ కమిటీ నియామక సమావేశం నిర్వహించడం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా జనసేన పార్టీ రాష్ట్ర చేనేత వికాస విభాగం చైర్మన్ మరియు మంగళగిరి నియోజకవర్గ ఇంచార్జ్ చిల్లపల్లి శ్రీనివాసరావు పాల్గొనడం జరిగింది. ముందుగా పోలకంపాడు వద్ద నుంచి భారీ ర్యాలీతో, మహిళలు హారతులతో చిల్లపల్లి శ్రీనివాసరావు గారిని ఆహ్వానించడం జరిగింది. అలాగే ఉండవల్లి గ్రామంలోని అంబేద్కర్ నగర్ వద్ద డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి మరియు బాబు జగ్జీవన్ రామ్ గారి విగ్రహానికి మరియు ఉండవల్లి గ్రామంలోని వంగవీటి మోహన్ రంగా గారి విగ్రహానికి పూలమాలేసి నివాళులర్పించడం జరిగింది. తదనంతరం బైక్ ర్యాలీతో ఉండవల్లి గ్రామంలో ఏర్పాటు చేసిన ఉండపల్లి గ్రామ కమిటీ నియామక సమావేశం సభా ప్రాంగణానికి చేరుకోవడం జరిగింది. తదనంతరం నూతనంగా నియమితులైన ఉండవల్లి గ్రామ కమిటీ సభ్యులకు నియమిక పత్రాలు చిల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ సందర్భంగా చిల్లపల్లి శ్రీనివాసరావు మాట్లాడుతూ జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆమోదంతో నూతనంగా నియమితులైన ఉండవల్లి గ్రామ కమిటీ సభ్యులకు ముందుగా శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే ఆనాడు వంగవీటి మోహన్ రంగా గారిని పోగొట్టుకున్నాం. కానీ ఈనాడు ప్రజల భవిష్యత్తు శ్రేయస్సు కొరకు నిలబడిన పవన్ కళ్యాణ్ గారిని మనమందరం కలిసికట్టుగా కాపాడుకుంటూ రాబోయే ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు సీఎం అయ్యేవిధంగా మనమందరం ఆయన వెంట ఉండాలని అన్నారు. అలాగే జనసేన పార్టీ కోసం కార్యకర్తలు, జన సైనికుల కోసం పవన్ కళ్యాణ్ గారు చేపట్టిన జనసేన పార్టీ క్రియాశీలక సభ్యత్వం నమోదు కార్యక్రమంలో భాగంగా 6000 పైచిలుకు సభ్యతాలను నమోదు చేసిన గుంటూరు జిల్లాలోని మంగళగిరి నియోజకవర్గం మూడో స్థానంలో ఉందని, ఉండవల్లి గ్రామంలో సుమారుగా 600 సభ్యత్వాలు పైగా చేసిన గ్రామం మనం ఉండవల్లి గ్రామం అని రానున్న రోజుల్లో పార్టీ బలోపేతానికి అందరూ కలిసికట్టుగా పనిచేయాలని కోరారు. తదనంతరం ఉండవల్లి గ్రామ జనసైనికుడు షేక్ మున్నీ గారు ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించడం జరిగింది. జనసేన పార్టీ మంగళగిరి నియోజకవర్గం నాయకుల ఆర్థిక సాయంతో వారి కుమార్తెలు పేరుమీద 25 వేల రూపాయలు బ్యాంకులో ఫిక్స్డ్ డిపాజిట్ చేసి సంబంధిత బాండును వారి కుటుంబ సభ్యులకు చిల్లపల్లి శ్రీనివాసరావు గారి చేతుల మీదుగా అందించడం జరిగింది. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ రాష్ట్ర నాయకులకు, గుంటూరు జిల్లా నాయకులు, మంగళగిరి నియోజకవర్గ నాయకులు, MTMC కమిటీ సభ్యులు, రాష్ట్ర చేనేత వికాస విభాగం కమిటీ సభ్యులు, మంగళగిరి, తాడేపల్లి దుగ్గిరాల కమిటీ సభ్యులు, ఉండవల్లి గ్రామ నాయకులు, జనసైనికులు, కార్యకర్తలకు, వీరమహిళలు, జనసేన పార్టీ సానుభూతి పరులు తదితరులు పాల్గొన్నారు.