ఆచంట ( జనస్వరం ) : యువత అంతా అందంగా కలిసి వినాయక మండపాలు ఏర్పాటు చేసుకుంటుంటే వాటి పర్మిషన్ పేరుతో వైస్సార్ ప్రభుత్వం అనేక ఆంక్షలు విధుస్తూ, చలానాల పేరుతో డబ్బులు వసూలు చేయడం మానుకోవాలని, వినాయక చవితి కేవలం ఒక మతానికి చెందిన పండుగ మాత్రమే కాదన్నారు. వినాయక ఉత్సవాల్లో అన్ని వర్గాలకు చెందిన యువత స్వచ్చందంగా పాల్గొని సంబరాలు చేసుకుంటారని, కాబట్టి వినాయక మండపాలకు అనుమతుల పేరుతో ఆంక్షలు విధించి అడ్డుకోవాలానుకోవడం బాధాకమని, కాబట్టి వినాయక మండపాలు ఏర్పాటు అడ్డుకోవడం యువత సంతోషన్ని అడ్డుకోవడమే అవుతుందని అన్నారు. కాబట్టి ప్రభుత్వం వెంటనే వినాయక మండపాలకు బేషారుతుగా పర్మిషన్ ఇవ్వాలని జనసేనపార్టీ ఉమ్మడి పగో జిల్లా సెక్రెటరీ చిట్టూరి శ్రీనివాస్ డిమాండ్ చేసారు. ఈ కార్యక్రమం లో జనసేన నాయకులు కడిమి ఉమామహేశ్వరస్వామి, ఏడిద తేజా విగ్నేష్, పంపన శ్రీనివాస్, కడిమి శ్రీనివాస్, ఇర్రింకి శ్రీనివాస్, ఏడిద బాలు, కాసు రుద్రమణి మొదల్గువారు పాల్గొన్నారు.