చీపురుపల్లి ( జనస్వరం ) : జనసేనపార్టీ అద్వర్యంలో ఈ వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా చీపురుపల్లి మెయిన్ రోడ్ లో ర్యాలీగా వెళ్ళి మూడు రోడ్ల కూడలిలో నిరసన గళం వినిపించారు. ఆనంతరం చీపురుపల్లి నియోజకవర్గం జనసేన పార్టీ నాయకులు విసినిగిరి శ్రీనివాసరావు గారు మాట్లాడుతూ ఈ కరెంటు కోతల వలన, అసలే అరకొర వర్షాలతో బోరు బావులపై ఆధారపడి వ్యవసాయం చేసిన రైతులు తాను వేసిన పంటకు సకాలంలో నీరు లేక రైతులు తీవ్రంగా నష్టోతున్నారని అన్నారు. అసంఘిటిత కార్మికులైన కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, చేనేత, భవన కార్మికులు, శ్రామికులు, కర్షకులు, కుటీర పరిశ్రమలు సైతం కుదేలై ఈ వైసీపీ ప్రభుత్వము ప్రజలకు కడుపుకోతను మిగులుస్తుందనీ విమర్శించారు. అలాగే మెరకముడిదం జనసేన పార్టీ మండల అధ్యక్షులు రౌతు కృష్ణవేణి నాయుడు మాట్లడుతూ రాష్ట్రంలో గ్రామీణ, పట్టణ ప్రాంతాలలో దోమలు ఈగలు తో ప్రజలు తీవ్ర అనారోగ్యాలకు గురై హాస్పిటల్ పాలైనా ఇంతవరకు దోమల నివారణకు ఈ వైసీపీ ప్రభుత్వం ఎటువంటి నివారణ చర్యలు తీసుకోలేదు. ప్రభుత్వ యంత్రాగం మొద్దు నిద్ర వహిస్తుంది. పల్లె పట్టణ ప్రాంతాలలో డెంగ్యూ మలేరియా డయేరియా వంటి రోగాలు విజృంభస్తున్నాయి. వాటిని నివారించుటకు ఎటువంటి చర్యలు తీసుకోలేదు .ఇంతవరకు పంచాయతీ రాజ్ శాఖ మంత్రి, అధికారులూ నిమ్మకు నీరెత్తినట్లు చోద్యం చూస్తున్నారు. ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారు. రాబోయే రోజుల్లో ఈ చేతకాని వైసీపీ ప్రబుత్వానికి బుద్ధిచెప్పి జనసేన ప్రభుత్వాన్నీ స్థాపించడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని తెలియజేశారు. అలాగే జనసేన నాయకులు y. లక్ష్మి నాయుడు మాట్లడుతూ కరెంట్ కోతలతో విద్యార్థులు పరీక్షల టైం లో తీవ్రంగా నష్టపోతున్నారు అని జాబ్ కేలండర్ ఎలాగూ లేదు కనీసం చదువుకోవడానికి కరెంట్ ఇవ్వలేని పరస్థితి లో ఈ ప్రభుత్వం ఉందని ఎద్దేవా చేశారు ఈ కార్యక్రమం లో నాలుగు మండలాల జనసేన పార్టీనాయకులు యడ్ల సంతోష్, రామునాయుడు, సత్యన్నారాయణ, రమణ, యేసు, శ్రీను బాల, సింహాచలం, శంకర్, ధనుంజయ, ప్రతాప్, సురేష్, కర్లం జనసైనికులు, చీపురుపల్లి జనసైనికులు పాల్గొన్నారు.