Search
Close this search box.
Search
Close this search box.

ప్రజా మద్దతును చూసి ఓర్వలేకపోతున్నారు – జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్

అన్నపూర్ణ

– వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయి వెన్నులో వణుకు పుట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారు.
– విశాఖ ఉక్కును ప్రైవేటు పరం చేయొద్దని అఖిలపక్షం ఏర్పాటు చేయకపోతే సీఎం జగన్ ప్రైవేటీకరణకు మద్దతు ఇచ్చినట్లే
– మంత్రి కొడాలి నాని గతంలో ఉత్తరకుమారుడి లాగా ప్రగల్భాలు పలికారు విశాఖ ఉక్కు ఉద్యమాన్ని ముందుండి నడిపిస్తామన్నారు.. నేడు మాట తప్పారు.
వైసీపీకి ప్రజల్లో ఆదరణ తగ్గి వెంటిలేటర్ పై కొట్టిమిట్టాడుతోంది.
– రాబోయే ఎన్నికల్లో ఘోర పరాభవం తధ్యం.
– పిచ్చెక్కి మాట్లాడుతున్న మంత్రులును ఎర్రగడ్డ పిచ్చాసుపత్రిలో చేర్పించాలి
     విజయవాడ, (జనస్వరం) : జనసేన పార్టీ విజయవాడ నగర అధ్యక్షులు రాష్ట్ర అధికార ప్రతినిధి పోతిన వెంకట మహేష్ మంగళవారం నిర్వహించిన విలేఖర్ల సమావేశంలో మాట్లాడుతూ విశాఖ ఉక్కు ప్రైవేటుపరం చేయొద్దని విశాఖపట్నంలో నిర్వహించిన సభకు లక్షలాది మంది హాజరై పవన్ కళ్యాణ్ కి మద్దతు పలకడాన్ని చూసి వైసీపీ నాయకులకు మైండ్ బ్లాక్ అయి, వెన్నులో వణుకు పుట్టి ఇష్టానుసారం మాట్లాడుతున్నారన్నారు. పవన్ కళ్యాణ్ కి ప్రజల్లో వస్తున్న ఆదరణ చూసి ఓర్వలేక వైసీపీ మంత్రులు పనికి మాలిన మాటలు మాట్లాడుతున్నారని ఎద్దేవా చేశారు. నిజంగా వారికి చిత్తశుద్ధి ఉంటే పవన్ కళ్యాణ్ డిమాండ్ చేసిన విధంగా వారం రోజుల్లో అఖిలపక్షం ఏర్పాటు చేసి ఢిల్లీకి తీసుకు వెళ్లాలని, లేనిపక్షంలో సీఎం జగన్ విశాఖ ఉక్కు ప్రైవేటు పరం చేసేందుకు అంగీకరించినట్లేనని అన్నారు. పవన్ కళ్యాణ్ పై అవాకులు చవాకులు మాట్లాడుతున్న మంత్రులు విశాఖ ఉక్కు ప్రైవేటుపరం కానీయకుండా ఉండేందుకు వైసీపీ ఎంపీలు ప్రజాప్రతినిధులు ఎందుకు పోరాటం చేయడం లేదో సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. విశాఖ ఉక్కు అమ్మేసేందుకు పోస్కో కంపెనీని ఆహ్వానించడం వాస్తవం అవునో కాదో ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. నష్టాలను భర్తీ చేసేందుకు కేంద్ర సాయం కోరకుండా విశాఖ స్టీల్ ప్లాంట్ కు సంబంధించిన ఏడు వేల ఎకరాలను అమ్మి వేయాలని ప్రతిపాదన సీఎం జగన్ లేఖ రూపంలో కేంద్రానికి తెలియ చేసిన మాట వాస్తవం అవునో కాదో ముందు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. పాదయాత్ర చేసిన విజయసాయి రెడ్డి నేడు విశాఖ ఉక్కుపై స్పందించకుండా మౌనంగా ఎందుకు ఉంటున్నారో రాష్ట్ర ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. పవన్ కళ్యాణ్ కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చే విధంగా విశాఖ ఉక్కు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సభకు హాజరై రాష్ట్ర ప్రజల భావోద్వేగాలను రాష్ట్ర అభివృద్ధిని ఆకాంక్షించిన నిజమైన నాయకుడు అని, కానీ సీఎం జగన్ ప్రజల ఆకాంక్షకు వ్యతిరేకంగా స్వార్థ ప్రయోజనాలు పొందేందుకు చూస్తున్నారన్నారు. గతంలో మంత్రి కొడాలి నాని విశాఖ ఉక్కు ఉద్యమం ముందుండి నడిపిస్తానని ఉత్తర కుమారడిలాగా ప్రగల్భాలు పలికారని కానీ నేడు ఉద్యమించలేక చేతులెత్తేసి జనసేన పార్టీపై అర్థం పర్థం లేని ఆరోపణలు చేస్తున్నారన్నారు. ఆయన అవినీతి ఉద్యమం వినూత్నంగా చేస్తున్నారని పేకాట స్థావరాలను వినూత్నంగా చెరువుల వద్ద నిర్వహించడం, బియ్యం పక్కదారి పట్టించడం, ఆలయాల భూములు కాజేసేందుకు వారే స్వయంగా దేవాదాయ శాఖ కార్యాలయంలో మీటింగులు నిర్వహించడం, భూములు కబ్జా చేసి అక్రమంగా రియల్ ఎస్టేట్ వ్యాపారం వంటివి చేయడం మీద ఉన్న శ్రద్ధ విశాఖ ఉక్కు పై లేదని అందుకే నాలుక మడత పడి మడం తిప్పి విశాఖ ఉక్కుపై మాట్లాడకుండా జనసేన పార్టీపై అనవసరపు విమర్శలు చేస్తున్నారన్నారు. మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్ పొట్టి శ్రీరాములు విగ్రహానికి పూలమాలలు వేసిన సందర్భంగా విజయవాడ నగర వాసులు వారి దగ్గర్నుంచి ప్రకాశం బ్యారేజీ వద్ద గతంలో తొలగించిన పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని తిరిగి పున ప్రతిష్ట చేస్తామనే అంశం మీద ప్రకటన వస్తుందని అందరూ ఆశగా ఎదురు చూశారు కానీ ఉద్యమం పోరాటం అనే మాటలకు కనీస అర్థం తెలియని మంత్రి శ్రీను విశాఖ ఉద్యమంపై పోరాడుతున్న పవన్ కళ్యాణ్ పై పనికిమాలిన మాటలు మాట్లాడడం చాలా హాస్యాస్పదంగా ఉందన్నారు. పశ్చిమ నియోజకవర్గ సందుల్లో కూడా సమస్యలు పరిష్కరించలేని మంత్రి శ్రీనివాస్ లాబీయింగ్ చేయడంలో నిష్ణాతుడైన వ్యక్తి అని, వెల్లంపల్లి ఫౌండేషన్ పేరిట ప్రభుత్వ భూములు కబ్జా చేయడం వాస్తవం కాదా? అందులో భాగంగానే ఇరిగేషన్ స్థలం, పురావస్తు శాఖకు సంబంధించిన స్థలం మున్సిపల్ కార్పొరేషన్ కి సంబంధించిన విలువైన స్థలాలను కబ్జా చేసుకునే పని మీద ఉన్న మంత్రి వెల్లంపల్లి పవన్ కళ్యాణ్ పై మాట్లాడడం ఆకాశం మీద ఉమేసిన్నట్లేనని అన్నారు. ముందుగా మంత్రి మండలి సమావేశంలో జగనన్న రెండున్నర సంవత్సరాలుగా తాడేపల్లి ప్యాలెస్లో  క్వారంటైన్ ఉంటున్నారు. ఇక నుంచైనా బయటకు రావాలని… 151 మంది ఎమ్మెల్యేలు 22 మంది ఎంపీలతో ఉద్యమించి కేంద్ర ప్రభుత్వం మెడలు వంచి విశాఖ ప్రైవేటుపరం కానీయకుండా పోరాడాలని తెలియజేస్తే బాగుంటుంది కానీ పోరాడే పవన్ కళ్యాణ్ పై మాట్లాడితే ప్రజలు తగిన సమయంలో బుద్ధి చెబుతారన్నారని, పిచ్చెక్కి మాట్లాడుతున్న వైసీపీ మంత్రులను ఎర్రగడ్డ పిచ్చి హాస్పిటల్ లో చేర్పించి వైద్యం చేయించాలన్నారు.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

Info with Ai_20241104_092302_0000
శ్రీ పెన్నోబిలేసు స్వామి దేవాలయం పునః ప్రారంభోత్సవం
WhatsApp Image 2024-10-14 at 5.45
కందుకూరులో ఘనంగా పల్లె పండుగ వారోత్సవాలు
IMG-20240918-WA0003
కందుకూరులో స్వచ్ఛత హి సేవా కార్యక్రమం
కందుకూరు
కందుకూరు గ్రామంలో వాటర్ ట్యాంక్ క్లీన్ చేసిన సిబ్బంది
కందుకూరు
కందుకూరు గ్రామ పంచాయితీలో ఘనంగా పవన్ కళ్యాణ్ జన్మదిన వేడుకలు

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way