Logo
Date of Publish : 14 March 2026, 1:53 pm
Editor : Sake Naresh

అనంతపురంలో MSSS ఆధ్వర్యంలో చర్మ కార్మికులకు గొడుగుల పంపిణీ

అనంతపురం, మార్చి 13, (జనస్వరం) : మాదిగ సంక్షేమ సేవా సంఘం (MSSS) ఆధ్వర్యంలో అనంతపురం నగరంలో చర్మ కార్మికులు, చెప్పులు కుట్టే కార్మికులకు గొడుగులు పంపిణీ చేశారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు సాకే రామతీర్థ, జిల్లా అధ్యక్షుడు మన్నల సుబ్రహ్మణ్యం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. వేసవి తీవ్రత పెరుగుతున్న నేపథ్యంలో ఎండలో పనిచేసే కార్మికులకు ఉపశమనం కలిగించేందుకు ఇంద్రధనస్సు రంగుల గొడుగులు అందజేసినట్లు నిర్వాహకులు తెలిపారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో జీవనోపాధి కోసం పనిచేస్తున్న చర్మ కార్మికులకు ఈ గొడుగులు ఉపయోగపడతాయని పేర్కొన్నారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ 2015 సంవత్సరం నుంచి ప్రతి ఏడాది వేసవికాలంలో చర్మ కార్మికులకు గొడుగులు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. కష్టజీవులైన కార్మికులకు తోడ్పాటునందించడం తమ సంఘం ముఖ్య లక్ష్యమని పేర్కొన్నారు. భవిష్యత్తులో కూడా చర్మ కార్మికుల స్థితిగతులను మెరుగుపరచేందుకు సంఘం తరఫున సహాయం అందిస్తామని చెప్పారు. ఎండ తీవ్రతలో పని చేసే కార్మికులకు కొంత ఉపశమనం కలిగించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు వివరించారు. కార్యక్రమంలో కోటంక మల్లేష్, శంకరయ్య, రామకృష్ణయ్య, నాగేంద్ర, ధనుష్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com