Logo
Date of Publish : 18 March 2026, 7:51 pm
Editor : Sake Naresh

అరవ జయపాల్ కు ఉగాది సత్కారం

తిరుపతి, మార్చి 18, జనస్వరం : శ్రీ పరాభవ నామ ఉగాది వేడుకల సందర్భంగా ప్రజా కళావేదిక చైర్మన్, సీనియర్ జర్నలిస్ట్ అరవ జయపాల్ కు బుధవారం నెల్లూరులో ఘన సత్కారం జరిగింది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రంలో సంచాలకులు ఆచార్య మాడభూషి సంపత్ కుమార్ అధ్యక్షతన ద్విశతాధిక జాతీయ కవిసమ్మేళనం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా సర్వేపల్లి శాసనసభ్యులు, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి హాజరై మాట్లాడారు. అనంతరం జరిగిన కవిసమ్మేళనంలో అరవ జయపాల్ చేసిన స్వీయ కవితాగానం ఎంతగానో అలరించింది. ఈ సందర్భంగా జయపాల్ ను ఘనంగా సత్కరించారు. తొలుత అందరికీ షడ్రుచులతో కూడిన ఉగాది పచ్చడిని అందజేశారు. వెంకటాచలంలోని దీన్ దయాల్ ఉపాధ్యాయ అంత్యోదయభవన్ ప్రాంగణం కవుల సందడితో కిటకిటలాడింది. ప్రాచీన తెలుగు విశిష్ట అధ్యయన కేంద్రం పరిశోధకులు డా. నూనావత్ రాంబాబు, డా. కొల్లేటి రవిబాబు, డా. సోమరాజుపల్లి మమత, డా. టి.ఎస్. వెంకటేష్, డా. బడిగె ఉమేష్, డా. పోచంబావి గోపికృష్ణ, డా. ఈతకోట ఈశ్వరరావు, డా. పి. నరసింహం, డా. కె. గౌరీశ్వరరావు, డా. పి. లోకేశ్వరి, డా. ఆర్. బాలసుబ్రమణ్యం, డా. కనియంపాటి రామకృష్ణ, డా. సుభాషిణి, డా. గాయత్రీదేవి తదితరులు కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com