Logo
Date of Publish : 22 March 2023, 4:02 pm
Editor : Sake Naresh

ప్రజల మధ్యనే ఉగాది పండుగ : పవనన్న ప్రజాబాటలో జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి

         నెల్లూరు సిటీ ( జనస్వరం ) : జనసేన పార్టీ నేత కేతంరెడ్డి వినోద్ రెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న పవనన్న ప్రజాబాట కార్యక్రమం 302వ రోజున ఉగాది పండుగ రోజున 9వ డివిజన్ బంగ్లా తోట ప్రాంతంలో జరిగింది. ఇక్కడ ప్రతి ఇంటికి తిరిగిన కేతంరెడ్డి ప్రజల సమస్యలను తెలుసుకుని పరిష్కారం దిశగా తమ వంతు పోరాటం చేస్తామని భరోసా కల్పించారు. ఈ సందర్భంగా కేతంరెడ్డి వినోద్ రెడ్డి మాట్లాడుతూ ప్రజలందరికీ ఉగాది పండుగ శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలతో కలిసి ఉగాది పండుగ జరుపుకుంటూ ఉగాది పచ్చడిని ఆస్వాదించడం ఆనందంగా ఉందని అన్నారు. ఈ వైసీపీ ప్రభుత్వంలో ఇది నాలుగో ఉగాది పండుగ అని, మొదటి ఉగాది నాటికే పేదలందరికీ సొంత ఇళ్ళు ఇస్తామన్న ప్రభుత్వం నాలుగో ఉగాదికి కూడా ఆ హామీని నెరవేర్చలేదని అన్నారు. వచ్చే ఉగాదికి ఈ దగాకోరు ప్రభుత్వం ఉండదని, నవ నూతన ఉత్తేజంతో పవనన్న ప్రభుత్వం ఏర్పాటవుతుందని తెలిపారు. వైసీపీ ప్రభుత్వ వైఫల్యాలను తాము ప్రజలకు వివరిస్తుంటే, ప్రజలు మరింతగా తమకు వివరిస్తున్నారని, పవన్ కళ్యాణ్ గారు ముఖ్యమంత్రి కావాలని ప్రతి ఒక్కరు ఆశగా ఎదురుచూస్తున్నారని, ఆ రోజులు ఎంతో దూరంలో లేవని కేతంరెడ్డి వినోద్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక జనసేన పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com