పాలకొండ ( జనస్వరం ) : జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా నియమించబడి మొదటసారిగా రాజాం నియోజకవర్గం విచ్చేసిన పిసిని చంద్ర మోహన్ ని నియోజకవర్గ నాయకులు యు.పి.రాజు ఆధ్వర్యంలో రాజాం నియోజకవర్గం జనసేన పార్టీ కార్యాలయంలో పిసిని చంద్రమోహన్ కి అభినందన సభ ఏర్పాటు చేసి సన్మానం చేసి ఘనంగా సత్కరించారు. ఈ సందర్బంగా పిసిని చంద్రమోహన్ మాట్లాడుతూ జనసేన పార్టీ భవిష్యత్తు కార్యాచరణ గురుంచి మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ ఆశయాసాధన కోసం కృషి చేయాలనీ పార్టీ కార్యకర్తలకు దిశా నిర్దేశం చేశారు. యు.పి.రాజు మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలును సిద్ధాంతాలును ప్రజల్లోకి తీసుకువెళ్లే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలనీ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎచ్చర్ల నాయుకులు భూపతి అర్జున్, జిసిగడం మండలం అధ్యక్షులు రవికుమార్, పైడి రాజు, గొర్లె గోవిందరావు, కుమారి, సామంతుల రమేష్, రెడ్డి బాలకృష్ణ, ఎన్ని సత్యనారాయణ, నాగరాజు, హరిబాబు, శ్యామ్, రాంబాబు, ఈశ్వర్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com