ఆంధ్ర ప్రదేశ్ లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ప్రజలలో ప్రభుత్వ వ్యతిరేకత విపరీతంగా గత రెండు సంవత్సరాలుగా పెరిగిపోయిందని రైల్వే కోడూర్ జనసేన పార్టీ నాయకులు గంధం శెట్టి దినకర్ బాబు పేర్కొన్నారు.. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ప్రజా వ్యతిరేక కార్యక్రమాలను చేస్తుందన్నారు కారణం ప్రభుత్వ ఉద్యోగుల పెన్షన్ స్కీం మరియు తెలంగాణ తరహా పే స్కేల్స్ అమలు చేయడం లేదని ఉద్యోగులు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారన్నారు.. అంతేకాకుండా రాష్ట్రంలోని విలేకరులకు గుర్తింపు కార్డులు, బస్సు పాసులు, ఇన్సూరెన్స్ సౌకర్యాలు ఇప్పటివరకు ప్రభుత్వం పట్టించుకోలేదన్నారు… రాష్ట్రంలో విపరీతమైన లిక్కర్ రేట్లు , సరైన ఇసుక విధానం లేక బిల్డర్స్ మరియు బిల్డింగ్ నిర్మాణ కార్మికులు పూర్తి వ్యతిరేకంగా ఉన్నారన్నారు. రాష్ట్రంలోని పలు శాఖల్లో ఉద్యోగ నిర్వహణ బాధ్యతలు నిర్వహిస్తున్న తాత్కాలిక ఉద్యోగులు ప్రైవేట్ స్కూల్స్ టీచర్లు మరియు 2020 లో కోవిడ్ వచ్చిన కారణంగా వైద్యశాలలు అందులోని వైద్యులు ఖర్చు చేసిన బిల్లులు ఇంతవరకు రాలేదని… గత ప్రభుత్వ హయాంలోని కాంట్రాక్టు బిల్లులు కూడా ఇంతవరకు రాలేదని…. ప్రభుత్వ ఉద్యోగ పెన్షన్లు ఒకటో తేదీని రావలసివి.. పెన్షన్స్ సరైన వేళలో రాక అందులో కొంత కోత కూడా ఏర్పడిందని అంతేకాకుండా వాలంటీర్ల వ్యవస్థను తాత్కాలిక ఉద్యోగులు మాత్రమే అనడం వలన వ్యతిరేకత తీవ్ర స్థాయిలో ఉన్నదన్నారు.. రాష్ట్రంలోని పదవ తరగతి మరియు ఇంటర్ విద్యార్థులు మరియు వారి తల్లిదండ్రులు సుమారు 50 శాతం ప్రభుత్వ వ్యతిరేకత కలిగి ఉన్నారు కారణం సరైన పరీక్ష విధానం తెలియక విద్యార్థులను వారి తల్లిదండ్రులను అయోమయ స్థితిలో ఉంచారు… రెండు సంవత్సరాలు పూర్తి కావస్తున్న రాజధాని సరైన దిశలో లేకపోవడం రాష్ట్రానికి అప్పులు కుప్పలు కుప్పలుగా పెరిగిపోవడం రకరకాల కార్పొరేషన్లో పేరుతో సమయాన్ని వృధా చేయడం తదితర కారణాల వలన వైసీపీ ప్రభుత్వం ప్రజల లో తీవ్ర వ్యతిరేకతను మరియు అసహనాన్ని కొని తెచ్చుకున్నదని పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి :
మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here