బొబ్బిలి ( జనస్వరం ) : వైసిపి బస్సు యాత్ర కోసం సభ ప్లానింగ్ & నిర్వహణ అంతా అధికారులే దగ్గరుండి చెయ్యడం మన ప్రజాస్వామ్య వ్యవస్థకే సిగ్గు చేటని జనసేన నాయకులు అన్నారు. వారు మాట్లాడుతూ MLA శంబంగి... ఈ సాధికార యాత్రతో ఏం సాధించారు. బొబ్బిలి నియోజకవర్గం ప్రజలు మీ పాలనకు విసిగిపోయి మిమ్మల్ని నమ్మడం లేదనే విషయాన్ని తెలుసుకుని, పక్క నియోజకవర్గాల నుంచి మనిషికి 300, క్వార్టర్ మధ్యం ఇస్తామని ఆశ చూపి, మీ అనుయాయులు కేవలం 200 మాత్రమే చేతిలో పెట్టి పంపించారని తెలిసింది. ఇందులో కూడా వైసిపి నాయకులు అవినీతికి పాల్పడేంత దిగజారిపోయారే అని సభకు వచ్చిన జనం నవ్వుకుంటున్నారని జనసేన నాయకులు బాబు పాలూరు ఎద్దేవా చేసారు. ఒక్క రోజు సభ కోసం కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి, మన బొబ్బిలి నియోజకవర్గంలో మీ వైసిపి అధికారంలోకి వచ్చాక ఏ అభివృద్ధి కార్యక్రమాలు చేసారో చెప్పుకోలేని దీనస్థితిలో ఉన్నారంటే MLA గా మీ పని తీరు ఎంత పేలవంగా ఉందో బొబ్బిలి ప్రజలందరూ గమనించారు. BC హాస్టల్ ను మూసేసి, మన BC, SC ల జీవనాధారమైన చక్కెర మరియు జ్యూట్ కర్మాగారాలను, గ్రోత్ సెంటర్ లో కొన్ని కంపెనీలను నామరూపాలు లేకుండా మాయం చేసేసి మన BC, SC సామాజిక వర్గాలకు చెందిన రైతు మరియు శ్రామిక సోధరులను నయవంచన చేసిన అసమర్థ MLA శంబంగి చినప్పలనాయుడుకి అసలు సామాజిక సాధికార యాత్ర సమావేశం నిర్వహించడానికి అర్హత ఉందా? కోట్లలో డబ్బులొచ్చే కాంట్రాక్టులు పేరుతో కొన్ని రోడ్లు, భవనాలు తప్పితే మన బొబ్బిలి నియోజకవర్గంలో మీరు చేసిన అభివృద్ధి ఏంటి? రైతులకు సకాలంలో సాగు నీరు అందించడంలో విఫలం, పెండింగ్ ఇరిగేషన్ ప్రాజెక్టులను పూర్తి చెయ్యడంలో విఫలం, మన నియోజకవర్గంలో పంట నష్టపోయి కరువు కోరల్లో చిక్కుకున్న రైతు కోసం నిలబడటంలో విఫలం, పరిశ్రమలు తీసుకురావడంలో విఫలం, యువతకు ఉపాధి కల్పించడంలో పూర్తిగా విఫలం, మీకు లాభం లేని చాలా రోడ్లు నిర్మాణంలో విఫలం, పారాధి బ్రిడ్జి నిర్మాణంలో విఫలం, మన నియోజకవర్గంలో అభివృద్ధి విషయంలో సంపూర్ణంగా విఫలం, మీ హయాంలో భూ కబ్జాలు, చెరువుల ఆక్రమణల్లో మాత్రం మీ అనుయాయులు చాలా సఫలం. MLA గా అన్ని కోణాలలో వైఫల్యాలనే మూట గట్టుకుని మన బొబ్బిలి నియోజకవర్గాన్ని 20 ఏళ్లు వెనక్కి నెట్టేసిన శంబంగి గారికి అసలు ప్రజల్లో తిరిగే నైతిక అర్హత కూడా లేదంటూ జనసేన పార్టీ రాష్ట్ర కార్యనిర్వహణ కార్యదర్శి బాబు పాలూరు గారు వైసిపి పాలనపై ఏకరువు పెట్టి మీడియా ప్రకటన విడుదల చేశారు. ఈ మీడియా సమావేశంలో జనసేన పార్టీ బొబ్బిలి మండల అధ్యక్షులు సంచాన గంగాధర్, బొబ్బిలి పట్టణ నాయకులు పల్లెం రాజా పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com