
అమరావతి, (జనస్వరం) : రాష్ట్ర ప్రభుత్వమే సమస్యకు బీజం వేసి… దాన్ని శాంతిభద్రతల సమస్యగా మారుస్తున్న తీరును ప్రజాస్వామ్యవాదులు ఖండించాలన్నారు. సజావుగా సాగుతున్న ఎయిడెడ్ విద్యా సంస్థల విషయంలో విద్యార్థుల్లో ఆందోళన నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. విద్యార్థులు, తల్లితండ్రులు రోడ్ల మీదకు వచ్చి ఎయిడెడ్ స్కూల్స్, కాలేజీలు మూసివేయవద్దని డిమాండ్ చేస్తూనే ఉన్నారని అన్నారు. అనంతపురంలో దశాబ్దాల చరిత్ర ఉన్న SSBN కాలేజీను ఎయిడెడ్ గానే కొనసాగించాలని విద్యార్థులు చేస్తున్న ఆందోళనను పోలీసుల ద్వారా ఆపాలని చూడటం అప్రజాస్వామికమన్నారు. ఆందోళన చేస్తున్న విద్యార్థులపై లాఠీలు ఝుళిపించి భయభ్రాంతులకు గురి చేయడాన్ని జనసేన పార్టీ తరపున ఖండిస్తున్నామన్నారు. ఒక విద్యార్థిని తలకు బలమైన గాయమైందంటే ఆ కళాశాల ప్రాంగణంలో ఎలాంటి పరిస్థితులు ఏర్పడ్డాయో అర్థం అవుతోందన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పడుతున్న ఆవేదనను పరిగణనలోకి తీసుకోకుండా ఈ అంశాన్ని ఒక శాంతిభద్రతల సమస్యగా మార్చాలనుకోవద్దని ఆయన అన్నారు. ఎందరో దాతలు విద్యాభివృద్ధి కోసం ఆస్తులు దానం చేసి పేదలకు విద్యను చేరువ చేశారు. సీఎం జగన్ రెడ్డి అనాలోచిత చర్యల వల్ల ఎంతో చరిత్ర ఉన్న పాఠశాలలు, కాలేజీలు విద్యార్థులకు దూరమయ్యే పరిస్థితులు నెలకొన్నాయన్నారు.