కర్నూలు ( జనస్వరం ) : కర్నూలు జిల్లాలో జరిగినటువంటి అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ రాష్ట్ర మహాసభలలో అంబేడ్కర్ విశ్వవిద్యాలయం అధ్యక్షులు, భాగ్ కన్వీనర్ తుమ్మగంటి వంశీ స్టేట్ వర్కింగ్ కమిటీ సభ్యుడుగా ఎన్నికవడం జరిగింది. ఈ సభలో వంశీ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్ధులు జీవితలతో అడుకోవద్దని చెప్పారు. విశ్వవిద్యాలయాలు మరయు కళాశాలు అధికార పార్టీ కార్యాలయాలుగా మార్చుతున్నారన్నారు. ఆంధ్రప్రదేశ్ నీ డ్రగ్స్ అడ్డాగా మార్చారని విమర్శ చేశారు. మీరు అధికారంలోకి రావడానికి ముద్దులు పెట్టారు, ఇప్పుడు ప్రజల వీపులపై గుద్దులు గుద్దుతున్నారు అని విమర్శ చేశారు. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ ధన్యవాదాలు తెలియజేశారు. అదే విధంగా విద్యార్థులకు ఎటువంటి సమస్య వచ్చిన ఎబివిపి అండగా ఉంటుంది అని చెప్పారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com