అనంతపురము, (జనస్వరం) : ట్రూ అప్ ఛార్జీల మోత దుర్మార్గపు చర్య. విద్యుత్ ఛార్జీల పెంపు సామాన్యులకు పెనుభారం. రాష్ట్రముఖ్యమంత్రి వై.ఎస్ జగన్మో హన్‌రెడ్డికి పాలన చేతకాకనే ఛార్జీలమోత మోగిస్తున్నారని అనంతపురం జనసేన జిల్లా ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరామిరెడ్డి గారు ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గృహ విద్యుత్తు వినియోగదారులపై ట్రూ అప్ ఇంధన చార్జీల సర్దుబాటు పేరుతో ప్రతి యూనిట్‌కు 1:28పైసలు పెంచడం సామాన్యుల నడ్డి విరచడమే అవుతుందన్నారు. ఇప్పటికే విద్యుత్తు బిల్లులు ప్రజలపై పెనుభారం అవుతుంటే అది చాలదన్నట్టు ట్రూ అప్ చార్జీల పేరుతో పెంచడం అమానుష చర్య అని ధ్వజమెత్తారు. నాడు ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో వై.యస్.జగన్ మోహన్ రెడ్డి గారు బాదుడేబాదుడు అంటూ రాష్ట్రమంతా కాలికి బలపం కట్టుకుని తిరిగి, నేడుఅధికారంలోకి రాగానే తాను బాదితే ఎలా ఉంటుందో ఈ ఛార్జీల పెంపు ద్వారా స్పష్టం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి తీసుకున్నఈ విద్యుత్ ఛార్జీల పెంపు నిర్ణయంతో అనంతపురం జిల్లాలోని ప్రజలపై 800 కోట్ల భారం పడుతుందన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 8600 కోట్ల రూపాయలు భారంపడుతుందన్నారు. తక్షణమే ఈ ట్రూ అప్ ఛార్జీల మోతను ఆపాలని లేనిపక్షంలో జనసేన పార్టీ తరుపున పెద్దఎత్తున వెల్లువెత్తుతున్న ప్రజావ్యతిరేకతకు ఉద్యమ రూపం ఇస్తుందని హెచ్చరించారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com