Logo
Date of Publish : 27 August 2020, 11:18 am
Editor : Sake Naresh

శ్రీకాకుళంలోని రిమ్స్ అత్యవసర విభాగానికి 12 సాధారణ వెంటిలేటర్స్ ను అందించిన జనసైనికులు

శ్రీకాకుళంలోని రిమ్స్ అత్యవసర విభాగానికి 12 సాధారణ వెంటిలేటర్స్ ను అందించిన జనసైనికులు

                   జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్ గారి  జన్మదినోత్సవ సందర్భంగా నిర్వహిస్తున్న వారోత్సవాలలో భాగంగా గురువారం శ్రీకాకుళంలోని రిమ్స్ అత్యవసర విభాగానికి 12 సాధారణ వెంటిలేటర్ సెట్లను పవన్ కళ్యాణ్, మెగా స్టార్ అభిమానులు కలిసి అందజేసారు. మెగా స్టార్ సోదరుడు నాగేంద్రబాబు పిలుపు మేరకు జిల్లాలో అభిమానులు కలిసి కోవిడ్ క్లిష్ట సమయంలో వైద్య సహాయం అందించడంలో ఉపయోగపడే సాధారణ వెంటిలేటర్ కిట్లను రిమ్స్ కు ఇచ్చారు. ఆక్సిజన్ సిలెండర్ ,వాల్వ్ ,మాస్క్ లతో కూడిన నార్మల్ వెంటిలేటర్ సెట్లను రిమ్స్ అధికారులకు జిల్లా జాయింట్ జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ చేతులు మీదుగా అందజేసారు. జిల్లా కో ఆర్డినేటర్లు తైక్వాండో శ్రీను, సయ్యద్ విశ్వక్ సేన్ , క్రాంతిశ్రీల ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ ముఖ్యఅతిధిగా పాల్గొన్నారు. ఆక్సిజన్  సిలెండర్ కిట్లు అందజేసిన తర్వాత సుమిత్ కుమార్ మాట్లాడుతూ ప్రపంచాన్ని కోవిడ్ వణికిస్తున్న తరుణంలో అత్యవసర వైద్య సహాయం అందజేసేందుకు ఉపయోగపడే నార్మల్ వెంటిలేటర్లను అందజేయడంలో భాగస్వామ్యులైన మెగా అభిమానులను అభినందిస్తున్నామన్నారు. కరోనా బారిన పడి తీవ్ర అస్వస్థతకు గురైన వారికి చికిత్స అందజేయడంలో ఆక్సిజన్ కిట్లు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. అటువంటి వాటిని అందజేసి అత్యవసర చికిత్సలు అందించేందుకు దోహదపడేవారవుతున్నారన్నారు. అత్యవసర విభాగల నుంచి వార్డులకు కరోనా బాధితులను తీసుకువెళ్లే సమయంలో మూవింగ్ ఆక్సిజన్ కిట్లు( నార్మల్ వెంటిలేటర్లు) కీలకమన్నారు. ఆ కిట్లను రిమ్స్ ఆసుపత్రికి అందజేయడం ఇక్కడ చికిత్సకు వచ్చే రోగుల అవి ఎంతో ఉపయోగపడతాయని స్పష్టం చేసారు. కరోనాని ఎదుర్కోవడంలో ప్రభుత్వం చేస్తున్న కృషిలో స్వచ్చంధ సంస్థలు భాగస్వామ్యులైతే మరింత మెరుగైన సేవలను ప్రజలకు అందజేయవచ్చని జాయింట్ కలెక్టర్ సుమిత్ కుమార్ అభిప్రాయపడ్డారు.

            ఈ కార్యక్రమంలో ఉత్తరాంధ్ర చిరంజీవి యువత ప్రధాన కార్యదర్శి వైశ్యరాజు మోహన్ , టెక్కలి ప్రాంత అభిమానులు కూరకుల యాదవ్, శ్రీధర్, దమ్మలవీది ఉదయ్ తో పాటు రాంచరణ్ యువశక్తి ప్రతినిధులు తైక్వాండో గౌతమ్, తేజ, అల్లు అర్జున్ యువత నవీన్, సాయిదరమ్ తేజ్ యువత ప్రతినిధులు జోగిపాటి వంశీ, కిరణ్ తదితరులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • Reporters
  • Reporter Apply
  • Verify Reporter

Designed By www.Webdigitalway.com