Logo
Date of Publish : 27 August 2020, 10:34 am
Editor : Sake Naresh

చిత్తూరు జిల్లాలోని రుయా ఆసుపత్రిలో 24 ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ చేసిన జనసైనికులు

చిత్తూరు జిల్లాలోని రుయా ఆసుపత్రిలో 24 ఆక్సిజన్ సిలెండర్లు పంపిణీ చేసిన జనసైనికులు

             జనసేన పార్టీ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జనసేన పార్టీ అధ్యక్షుడు శ్రీ  పవన్ కళ్యాణ్ గారి పుట్టిన రోజు వారోత్సవాల మొదటి దినం సందర్భంగా రాష్ట్రంలోని 13 జిల్లా హెడ్ క్వార్టర్స్ లోని ప్రభుత్వ కోవిడ్  ఆస్పత్రులకు ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్లను ఉచితంగా అందించే కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ కార్యక్రమంలో భాగంగాతిరుపతి రుయా హాస్పిటల్ కు పంపిణీ చేశారు 24 ఆక్సిజన్ యూనిట్స్ ను (ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్ల ) ఉచితంగా అందించే కార్యక్రమం చేయడం జరిగింది.  ఈ సందర్భంగా జనసేన పార్టీ నాయకులు మాట్లాడుతూ కరోనా కోరల్లో చిక్కుకుని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అల్లాడిపోతున్న నేపథ్యంలో ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్ల కొరత కారణంగా అనేక మంది పౌరులు తమ విలువైన ప్రాణాలను కోల్పోయిన దుర్ఘటన జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి మనసును తీవ్రంగా కలిచివేసింది. జనసైనికులు అందరూ కూడా రాష్ట్రంలోని కోవిడ్  ఆసుపత్రులలో ఉన్నటువంటి  ఆక్సిజన్ సిలిండర్ కొరత విషయాన్ని గమనించి ఈ సంవత్సరం జనసేనాని పుట్టినరోజు సందర్భంగా రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ ఆసుపత్రులలో ఆక్సిజన్ సిలిండర్లను ఉచితంగా పంపిణీ చేయాల్సి ఉన్నామని అన్నారు. అనుకున్నదే తడవుగా జనసేనాని శ్రీ పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు వారోత్సవాల మొదటి రోజునే రాష్ట్రంలోని 13 జిల్లాల హెడ్ క్వార్టర్స్ లో ఉన్న ప్రభుత్వ కోవిడ్  ఆసుపత్రులలో ఒకే రోజు ఒకే సమయాన ఆక్సిజన్ సిలిండర్లు, నార్మల్ వెంటిలేటర్ లను ఉచితంగా అందజేస్తున్నారు.
           మేము చేసే ఈ చిరు సాయం కారణంగా ఎంతో విలువైనటువంటి ప్రజల ప్రాణాలు రక్షించబడడమే జనసేనానికి మేము అందించే పుట్టినరోజు కానుక అని అన్నారు. ఈ ఆక్సిజన్ యునిట్స్ ద్వారా తిరుపతి రుయా హాస్పిటల్ లో వైద్య సేవలు అందుకుంటున్న సామాన్య ప్రజానీకానికి మరిన్ని మెరుగైన సేవలు అందించబడతాయని సహృదయంతో ఆకాంక్షిస్తున్నామని అన్నారు.ఈ కార్యక్రమానికి రుయా హాస్పిటల్ డైరెక్టర్ భారతి గారు మరియు జనసేన రాష్ట్ర నాయకులు చిత్తూరు జిల్లా నాయకులు, కార్యకర్తలు హాజరయ్యారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com