Search
Close this search box.
Search
Close this search box.

ఉత్తరాంధ్రలో జనసేన సంస్థాగత నిర్మాణానికి సీనియర్ నాయకులతో త్రిసభ్య కమిటీ : జనసేన అధినేత శ్రీ పవన్ కళ్యాణ్

   అమరావతి, (జనస్వరం) : ఉత్తరాంధ్రలోని మూడు జిల్లాలలో  జనసేనను  బలోపేతం చేయడానికి పార్టీ అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు చర్యలు చేపట్టారు. ముందుగా పార్టీలో  జిల్లా స్థాయి నుంచి గ్రామ స్థాయి వరకు కమిటీల నిర్మాణం పూర్తి చేసి ఆ తరువాత విస్తృతంగా పర్యటించాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా పార్టీలోని ముగ్గురు సీనియర్ నాయకులతో ఒక త్రిసభ్య కమిటీ ని నియమించారు. ఈ కమిటీలో పార్టీ పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీ అర్హన్ ఖాన్ గారు, పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ సభ్యులు శ్రీ పంతం నానాజీ గారు, శ్రీ ముత్తా శశిధర్ గారు సభ్యులుగా ఉంటారు. తొలుత జిల్లా కమిటీలు, ఆ తరువాత మండల, గ్రామ కమిటీల నిర్మాణం పూర్తయ్యేవిధంగా ఈ కమిటీ చర్యలు చేపడుతుంది. పార్టీ అధ్యక్షుల సూచనల మేరకు ఈ త్రిసభ్య కమిటీ సంస్థాగత నిర్మాణాన్ని పూర్తి చేస్తుంది.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

రిలేటెడ్ ఆర్టికల్స్

ఇవి కూడా చదవండి

ఫేస్ బుక్ ఖాతా ఫాలో అవ్వండి

ట్విట్టర్ ఖాతా ఫాలో అవ్వండి

ఇన్‌స్టాగ్రామ్ ఖాతా ఫాలో అవ్వండి

web digital way