Logo
Date of Publish : 07 December 2022, 7:58 am
Editor : Sake Naresh

అనంతసాగరంలో ఘనంగా అంబేద్కర్ వర్ధంతి నివాళులు

          ఆత్మకూరు ( జనస్వరం ) : దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు గ్రహీత డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి సందర్భంగా ఆత్మకూరు నియోజకవర్గం జనసేన నాయకులు మరియు అనంతసాగరం మండలం జనసేన పార్టీ అధ్యక్షులు షేక్ మహా బూబ్ మస్తాన్  ఆధ్వర్యంలో అనంత సాగరం బద్వేలు రోడ్డు కూడలి నందు గల అంబేద్కర్ గారి విగ్రహానికి పూల మాలలు వేసి నివాళులర్పించారు... ఈ సందర్భంగా మాట్లాడుతూ.. అంటరానితనం కుల వ్యవస్థ రాజ్యమేలుతున్న రోజుల్లో తాను ఎదుర్కొన్న వివక్షను రానున్న తరాలు ఎదుర్కోకూడదని ఒక ఆశయంతో పరిస్థితులకు ఎదురీది ఉన్నత శిఖరాలను అధిరోహించాలన్నారు. ఆ మహాపురుషుని స్మరిస్తూ వారి ఆశయ సాధనకు కృషి చే స్తూ అందరికీ అభివృద్ధి ఫలాలు అన్ని కులాలకు అందే విధంగా అందాలి అనే నినాదాన్ని జనసేన పార్టీ తరఫున పవన్ కళ్యాణ్ గారు నిజం చేస్తారని ఒకసారి జనసేన పార్టీకి అవకాశం ఇవ్వాల్సిందిగా కోరారు. ఎన్నో తరాలుగా మహనీయులు కులవివక్షను రూపు మార్చడానికి ఎంతో కృషి చేసిన ఇప్పటికీ మన మధ్యలో కులచిచ్చు రగిలిస్తూనే ఉన్నారు.. ఆర్థిక అసమానతలతో ప్రజలు తల్లడిల్లుతూనే ఉన్నారు ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తూనే ఉన్నారు. కొన్ని కులాలకే పరిమితమైన రాజ్యాధికారాన్ని అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారికి ఒక అవకాశం ఇస్తే అన్ని వర్గాల వారికి అందే విధంగా చేస్తారని తెలిపారు. ఈ కార్యక్రమంలో  మండల కార్యదర్శి ఎం పెంచలయ్య, ప్రసాద్ తదితర జన సైనికులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com