నెల్లూరు ( జనస్వరం ) : ఓర్పు, సహనం, మనోబలం, ఔదార్యం కలబోసిన అమృతా మూర్తులు మగువలు... ఇంటిల్లపాది తల్లిగా, చెల్లిగా, ఇల్లాలిగా అనేక బందాలతో మమతానురాగాలు పంచే మగువ లేనిదే జీవనగమనం లేదు. బాహ్య ప్రపంచంలో అన్ని రంగాలలో పనిఒత్తిడిని ఎదుర్కొనటం లో మగవారి కంటే ఎందులోనూ తీసుపోరు.. నిజంగా చెప్పాలంటే వారి కంటే ఎక్కువే అనే చెప్పాలి...కుటుంబాన్ని చక్కగా తీర్చిదిద్ద గల మహిళలు రాజకీయాల్లో కూడా వచ్చి ప్రజల ఆలనా పాలనా చూసే రోజులు రావాలని కోరుతూ... మగువలందరికీ అంతర్జాతీయ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు...వీర మహిళలు పార్టీకి పట్టుకొమ్మల వంటి వారు రానున్న రోజుల్లో జనసేన పార్టీ బలోపేతానికి సార్వత్రిక ఎన్నికలలో ప్రజా ప్రభుత్వానికి ఏర్పరచడానికి అందరూ కలిసి పనిచేయాల్సిందిగా తెలిపారు. ఈ కార్యక్రమంలో జనసేన పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగునుకుల కిషోర్,రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సుందరరామిరెడ్డి, జనసేన సీనియర్ నాయకులు రవికుమార్, పవన్ కళ్యాణ్ యవత జిల్లా అధ్యక్షులు గుడిహరి రెడ్డి, జనసేన వీర మహిళలు నాగరత్నం, కృష్ణవేణి, రేణుక,నందిని,కస్తూరి రాధమ్మ, నిర్మల, హాసినా,భారతి, ప్రసన్న, ఇందిరా, భవాని, సుబ్బమ్మ, సుదా, తదితరులు పాల్గొన్నారు. గంగిశెట్టి నరసింహ, ప్రశాంత్ గౌడ్, శరవణ,మౌనిష్, కేశవ ఇశాఖ్ తదితరులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com