అరకు, (జనస్వరం) : అరకు వేలి మండలం చోంపి పంచాయతీ పరిధిలో గల మర్రి వలస గ్రామంలో కొళాయి మరమ్మతులు చేపట్టి గిరిజనులకు మంచినీటి సౌకర్యం కల్పించాలని సోమవారం ఉదయం జనసేన పార్టీ నాయకులు సాయిబాబా, దురియా, అల్లంగి, రామకృష్ణ, పొద్దు, అర్జున్ ఆధ్వర్యంలో గ్రామస్తులతో సమావేశమై అనంతరం గ్రామాల్లో కొళాయి మరమ్మతు ప్రభుత్వం తక్షణమే చేపట్టాలని ప్రభుత్వానికి తెలిసేలా ఖాళీ బిందెలతో గిరిజనులు నినాదాలతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జనసేన నాయకులు సాయి బాబా, రామకృష్ణ, అర్జున్ తదితరులు మాట్లాడుతూ మర్రివలస గ్రామంలో నెలకొన్న కొలాయి మరమ్మతులు చేపట్టి మంచినీరు సౌకర్యం కల్పించాలని ఈ సందర్భంగా జనసేనపార్టీ తరఫున ప్రభుత్వానికి డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో జనసైనికులు, గ్రామస్తులు పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com