అభివృద్ధి కి ఏమాత్రం నోచుకోక సభ్య సమాజానికి దూరంగా జీవిస్తున్న గిరిజనులు ఆదివాసిలు దశాబ్ధాల తరబడి పాలకులు నిర్లక్ష్యానికి గురువుతూనే ఉన్నారు. గ్రామాల్లో ఆదివాసీలకు, మౌలిక సౌకర్యాల ఏర్పడటం లేదు. సీతంపేట మండలంలోని కుడ్డపల్లి పంచాయితీ పరిధిలో ఉన్న లంబగూడ ఆదివాసి గ్రామంలో సుమారు గా 25కుటుంబాలు నివాసం ఉంటున్నాయి. గ్రామానికి తాగునీరు కోసం వాటర్ ట్యాంక్ ఏర్పాటు చేశారు. గత ఐదు నెలలుగా వాటర్ ట్యాంక్ మరమ్మత్తులు గురవడంతో తాగునీటికష్టాలు తప్పడం లేదనీ వాపోతున్నారు. ఆంద్రప్రదేశ్ ట్రైబుల్ డెవలప్మెంట్ మిషన్ శ్రీకాకుళం జిల్లా ప్రధాన కార్యదర్శి మండంగి విశ్వనాధం గ్రామానికి మంగళవారం సందర్శించి గ్రామస్తులతో మాట్లాడి గ్రామసమస్యలు అడిగి తెలుసుకున్నారు. త్రాగు నీరుకోసం కీలోమీటరుదూరం నుండి బావినీరు తెచ్చుకుంటూ దాహార్తి తీర్చుకుంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైన ఉన్నతాధికారులు స్పందించి లంబగూడ ఆదివాసి గ్రామానికి మంచినీటి కష్టాలు తీర్చేందుకు చర్యలు తీసుకోవాలని గిరిజనులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి :
మెగాస్టార్ చిరంజీవి, జనసేనాని సేవలు తెలుగు రాష్ట్రాల ప్రజలకు దేవుడిచ్చిన వరం! జనసేన నాయకులు బండారు శ్రీనివాస్
అంబులెన్స్ దోపిడిని అరికట్టండి : నెల్లూరు జనసేన నాయకులు షానవాజ్
కర్నాటకలో చిరంజీవి ఆక్సిజన్ బ్యాంక్ ఏర్పాటు, సహకరించిన జనసైనికులు
సోషల్ మీడియాలో ” జనస్వరం న్యూస్ “ ను ఫాలో అవ్వండి :
Facebook Twitter Youtube Instagram Telegram DailyHunt APP Download Here