పాడేరు ( జనస్వరం ) : అల్లూరీ జిల్లా కొయ్యురు మండలంలో స్థానిక జనసేనపార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన సమావేశానికి ముఖ్య అతిథిగా అరకు పార్లమెంట్ జనసేనపార్టీ ఇన్చార్జ్ డా. వంపూరు గంగులయ్య, మరియు వివిధమండల నాయకులు హాజరయ్యారు. ఈ సమావేశంలో గంగులయ్య మాట్లాడుతూ గిరిజన ప్రజలు రాజకీయ చైతన్యవంతులైతేనే మన హక్కులు, చట్టాలు రక్షించుకోగలం అందుకు జనసేనపార్టీ ఒక నిర్మాణాత్మక పాత్ర పోషిస్తుందని అన్నారు. మేము ప్రభుత్వ వైఫల్యాలు చెప్పి సమయం వృధా చేసుకోదలుచుకోలేదు! ప్రభుత్వం యొక్క శతవిధానాల మోసాలు తెలుసుకోలేని దుస్థితిలో మన గిరిజన ప్రజాలున్నారంటే నమ్మం? మేము మా వంతుగా సమస్యలపై, ప్రభుత్వ గిరిజన వ్యతిరేక విధానాలపై ప్రశ్నిస్తూ? పోరాటం చేస్తూ? ఒక వైపు గిరిజన సగటు ఓటర్ లను చైతన్యవంతులం చేస్తున్నాం. మా సిద్ధాంతపు విలువలు పారదర్శక విధానాలతో ముడిపడి ఉంటుందన్నారు. ప్రస్తుత ప్రభుత్వం చేసిన మోసాలలో అనేకం ఉన్నాయి? కానీ వాటిలో ఒక సమస్య గురించి ప్రశ్నిస్తున్నాం? గిరిజన ప్రాంతంలో ఉన్న నిరుద్యోగ యువతకు జోనింగ్ విధానంలో పోస్టులు పంపిణీ ప్రకటనల్లో, జోనింగ్ రిజర్వేషన్స్ విషయాల్లో కూడా మార్పులు చెయ్యడం కారణంగా ఆవిధమైన ఉన్నా అవకాశాలుకూడా చేజార్చుకున్నామన్నారు. ఈ విధానంపై ఎంపీ, ఎమ్మెల్యేలు కనీస ఆలోచన చేయకపోవడం మమ్మల్ని మరింత బాధపెట్టిన విషయమని తెలియజేసారు ఇప్పటికే అనేక విషయాల్లో గిరిజనులకి వ్యతిరేకంగా ప్రభుత్వం చేసిన తీర్మాణం లో వ్యతిరేకించలేదు? భరించాం మన ప్రజాప్రతినిధులకు జాతి రక్షణ చర్యలు చేపట్టే సత్తా శక్తి లేదని సరిపెట్టుకున్నాం. కానీ జోనింగ్ విధానం అమలు తీరుపై వాస్తవ విషయాలు నిరుద్యోగ యువతకు తెలియజేయలేదు. మన ప్రజాప్రతినిధులకు తెలిసిన స్పందించకపోవడం నిరుద్యోగ యువతకు జరుగుతున్న మోసమని మేము స్పష్టంగా గుర్తించాం? ప్రశ్నిస్తున్నామన్నారు.
కొయ్యురు మండల అధ్యక్షులు గూడెపు లక్ష్మణ్ మాట్లాడుతూ గిరిజన ప్రజలకు మోసం చేసిన వైసీపీ పార్టీ విలువలు లేని పార్టీగా నేను గుర్తిస్తున్నాను. ఈ రాష్ట్ర యువతకు, అన్నివర్గాల ప్రజలకు ఎలా మోసం చేసిందో? పథకాల పేరుతో ఏమేమి సాధించిందో? మళ్ళీ అధికారం కోసం గ్రామాల్లో ఏ నైతిక హక్కుతో మాకు ఓటువెయ్యండని అడుగుతారో? ప్రజలు ఎలా అర్థం చేసుకుంటారో? వైసీపీ నాయకులు ఎదురుగా చేసిన మోసం కళ్ళకి కనిపిస్తున్న కూడా ఇంకోసారి అవకాశం ఇవ్వమని ఎలా అడగగలుగుతున్నారో అర్థం కాని విచిత్ర స్థితి? నిజానికి గిరిజనులు చైతన్యవంతులైతే వైసీపీ పార్టీకి గిరిజనులు ఓటు బ్యాన్ చేయాలన్నారు. లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్ మాట్లాడుతూ జనసేనపార్టీ లో బలమైన భావజాలం కలా యువకులు వుంటారు. వాళ్ళు జనసేనపార్టీ ద్వారా పారదర్శక విలువలతో ప్రజాపాలన విషయాలపై అవగాహన కలిగివున్నారు. మనం మన హక్కులు కోల్పోయే సమయంలో కూడా గళమెత్తలేని దీన స్థితిలో పడిపోయాం? అందుకే జనసేనపార్టీ ద్వారా మా వంతుగా భావితరాల భవిష్యత్ కై గిరిజన ప్రజల పక్షాన నిలబడ్డాం. రాబోయే ఎన్నికల్లో కచ్చితంగా విజయం సాధిస్తామన్నారు. చింతపల్లి మండల నాయకులు దేపురు రాజు,జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న సంయుక్తంగా ప్రజలకు జనసేనపార్టీ విధానాలు,ప్రస్తుతం విద్య, వైద్య, దోపిడీ, ఉచితాలు వాటి ప్రభావం గిరిజన ప్రజల మానసీకస్థితి జరుగుతున్న నష్టాలు వంటి విషయాలపై తెలియజేసారు. అనంతరం క్రియాశీలక సభ్యత్వ కిట్లు పంపిణీ చేయడం జరిగింది. ఈ సమావేశంలో కొయ్యురు మండల అధ్యక్షులు, గూడెపు లక్ష్మణ్, సాగెని బుజ్జిబాబు, జర్ర ప్రకాష్, పొట్టిక రామ్ ప్రసాద్, లీగల్ అడ్వైజర్ కిల్లో రాజన్, జి.మాడుగుల మండల అధ్యక్షులు మసాడి భీమన్న, చింతపల్లి మండల నాయకులు దేపురు రాజు, శేఖర్, రాజారావు, పాడేరు పట్టణ అధ్యక్షులు మజ్జి నగేష్, మంపనుంచి పలువురు మంది నాయకులు జనసైనికులు పాల్గొన్నారు.