అరకు ( జనస్వరం ) : రాష్ట్రంలో మిచేంగ్ తుఫాను ప్రభావం తీవ్రంగా చూపబోతున్న ఈ నేపథ్యంలో గిరిజన ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనులు మరియు జన సైనికులు అప్రమత్తంగా కలిగి ఉండాలని జనసేన పార్టీ మాజీ ఎంపిటిసి సాయిబాబా ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తుఫాను తీవ్రత ప్రభావం చూపగలుగుతున్న ఈ నేపథ్యంలో ప్రభుత్వం దృష్టి సారించవలసిన బాధ్యత ఎంతైనా ఉందని తెలిపారు. గిరిజన ప్రజల పట్ల ప్రభుత్వ సంబంధిత అధికారులు రక్షణ కవచంగా నిలబడాలని తెలిపారు. తుపాను కారణంగా పంటలు నష్టపోయి తీవ్రంగా రైతులుఇబ్బంది పడుతున్నారని, ప్రభుత్వం తక్షణమే పంటను నష్టపోయిన రైతులకు నష్టపరిహారం కల్పించాలని ప్రభుత్వానికి జనసేన పార్టీ డిమాండ్ చేస్తుంది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com