నెల్లూరు, (జనస్వరం) : నెల్లూరు నగరంలోని స్థానిక ట్రాన్స్కో ఎస్సీ కార్యాలయం నందు జనసేన పార్టీ సర్వేపల్లి ఇంచార్జ్ బొబ్బేపల్లి సురేష్ నాయుడు మరియు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ నెల్లూరు జిల్లా అధ్యక్షులు చిన్న పెంచలయ్య మరియు బీఎస్పీ ఆధ్వర్యంలో మనుబోలు మండలంలో ట్రాన్స్కో నందు ధర్నా నిర్వహించారు. ఈ సంధర్భంగా వారు మాట్లాడుతూ షిఫ్ట్ ఆపరేటర్ గా పని చేస్తున్న చిట్టేటి బానుచందర్ ను ఏ కారణాలతో తొలగించారో వివరణ ఇవ్వాలని, ఎవరి ప్రోద్బలంతో ఒక గిరిజనుల మీద ప్రతాపం చూపడం తగదని, బానుచందర్ ను వెంటనే విధుల్లోకి తీసుకోవాలని లేని పక్షంలో సోమవారం నుండి ధర్నా కార్యక్రమం కార్యాలయం ముట్టడి నిర్వహిస్తామని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో బాధితుడు భానుచందర్, కుటుంబ సభ్యులు జనసేన కార్యకర్తలు, నాయకులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com