Logo
Date of Publish : 07 November 2023, 8:07 pm
Editor : Sake Naresh

రైతుల ద్రోహి జగన్మోహన్ రెడ్డి : అనంతపురం జిల్లా జనసేన ఉపాధ్యక్షులు లాయర్ కుంటిమద్ది జయరాం రెడ్డి

      అనంతపురం, (జనస్వరం) : అనంతపురం ఉమ్మడి జిల్లా పుట్టపర్తిలో YSR రైతు భరోసా బహిరంగ సభలో మీరు చెపుతున్న మాయ మాటలు అన్ని పచ్చి అబద్ధాలే. రాష్ట్ర రైతులారా ఒక్క మారు ఆలోచన చేయండి? మీ గ్రామంలో ఉన్న RBK కేంద్రాల ద్వారా మీకు ఏమన్నా లబ్ధి చేకూరిందా? రాష్ట్రంలో ఎంతమంది రైతులకు "సున్నా" వడ్డీకి రుణాలు అందించారు ఇంతవరకు? పగటిపూటే నిరంతరంగా 9 గంటలు కరెంటు అందజేస్తున్నారా? రైతులకు రైతు భరోసా పథకం ద్వారా ఇస్తున్న 13,000 రూపాయల్లో.. కేంద్రం వాటా ఎంత? రాష్ట్రం వాటా ఎంత? రాష్ట్ర ప్రజలకు స్పష్టంగా తెలియజేయాలని జనసేన పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. పాడి పరిశ్రమ రైతులు దగ్గర సేకరిస్తున్న పాలకు లీటరుకు పది రూపాయలు రేటు పెంచామని గొప్పలు చెప్పుకుంటున్నారు? రాష్ట్ర ప్రజలకు లీటర్ పాలు జగన్మోహన్ రెడ్డి బినామీ కంపెనీల ద్వారా ఎంత రేటుకు కొమ్ముతున్నారు? భూ సర్వే చేశామని గొప్పలు చెప్పుకుంటున్నారు. భూ సర్వే చేసి మా పొలాల్లో సర్వే రాళ్లకు నీ బొమ్మలు ఎందుకు జగన్మోహన్ రెడ్డి ? మా తల్లిదండ్రులు సంపాదించిన ఆస్తుల పత్రాల్లో గాని, పాసు పుస్తకాల్లో నీ బొమ్మలెందుకు జగన్మోహన్ రెడ్డి? మా పత్రాల్లో నీ బొమ్మను చూసే దరిద్రం మాకెందుకు ఇదంతా ప్రజా సొమ్మును దుర్వినియం చేయడం కాదా? రాష్ట్ర ప్రజలారా ఆలోచించండి ఏ ప్రభుత్వ ఆసుపత్రిలో అన్న సౌకర్యాలు రోగులకు సవ్యంగా అందుతున్నాయా? సూది మందులు, మాత్రలు పూర్తిగా అవసరమైన అన్ని ఇస్తున్నారా? నాడు నేడు ద్వారా స్కూల్ అభివృద్ధి అంటున్నారు రాష్ట్ర ప్రజలారా మీ గ్రామంలో స్కూలుకు వెళ్లి చూడండి ఎంత అభివృద్ధి చేశారో మీకే అర్థమవుతుంది?పుట్టపర్తి సభా వేదికగా జగన్మోహన్ రెడ్డి చెప్పినవన్నీ పచ్చి అబద్దాలు, మాయ మాటలు, దొంగ లెక్కచారాలు అని రాష్ట్ర ప్రజలకు అర్థమైంది. కేవలం మాయ మూటలు దొంగ లెక్కచారాలు చెప్పి వచ్చే ఎన్నికల్లో ఏదో విధంగా అధికారంలోకి రావాలని తపన తప్ప చిత్తశుద్ధితో రాష్ట్ర ప్రజలకు మంచి చేసింది లేదు, అభివృద్ధి శూన్యం, ప్రజలకు ఉపాధి లేదు, రాష్ట్రం పూర్తిగా అన్ని రంగాల్లో సర్వనాశనం అయిపోయింది. భావితరాల భవిష్యత్తు ఆగమ్య గోచరంగా మారింది. ఇక నిన్ను నమ్మం జగన్ మేము అని తెలిపారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com