రాజమండ్రి, (జనస్వరం) : తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రిలో జరిగిన వీరమహిళల సమావేశంలో జనసేన పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీమతి పాలవలస యశస్విని గారు, స్త్రీల సమస్యల గురించి చర్చించడం జరిగింది. పాలవలస యశస్విని గారు మాట్లాడుతూ దిశా చట్టం ఉన్న ఆడవారికి ఎలాంటి న్యాయం జరగడం లేదని, ఈ ప్రభుత్వంలో స్త్రీలపై జరుగుతున్న అత్యాచారాలను, దురాగతాలను ఖండించడానికి వాటిని ఎలా ఎదుర్కోవాలి అనే అంశాలపై తగిన సూచనలు ఇవ్వడం జరిగినది. జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారి ఆశయాలు నచ్చి జనసేన పార్టీలో చేరడానికి సిద్దంగా ఉన్న మహిళల గురించి, పార్టీ బలోపేతం చేయడానికి ఏ విధంగా కార్యాచరణ ముందుకు తీసుకువెళ్లాలి అనే దానిపై మాకు సూచనలు చేయడం జరిగింది. ఈ సమావేశంలో జనసేన రాష్ట్ర కార్యదర్శి గంటా స్వరూప గారు, జిల్లా ఉపాధ్యక్షురాలు సుంకర కృష్ణవేణి గారు, జిల్లా కార్యదర్శులు బోడపాటి రాజేశ్వరి, షేక్ అమీనా గార్లు, వీరమహిళలు దారపు శిరీషా, తేజస్విని నాయుడు, కెళ్ళ జయలక్ష్మి, గురజాడ రాజేశ్వరి గార్లు పాల్గొనడం జరిగింది.
ఎడిటర్ : నరేష్ సాకే
Visit Us : www.janaswaram.com