Logo
Date of Publish : 10 November 2023, 10:07 pm
Editor : Sake Naresh

టి ఆర్ పురం లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల పత్రాలు మంజూరు చేయాలి

        గంగాధర నెల్లూరు, (జనస్వరం) : గంగాధర నెల్లూరు నియోజకవర్గం, వెదురు కుప్పం మండలం, టికేఎం పురం పంచాయతి, టి ఆర్ పురం గ్రామానికి చెందిన కొందరు లబ్ధిదారులకు నవరత్నాలు పేదలందరికీ ఇళ్ల పథకంలో ఇంటి పట్టాల ఇవ్వకపోవడం వలన వారికోసం నిరసన దీక్ష జనసేన పార్టీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమంలో యుగంధర్ మాట్లాడుతూ ఇది ఆరంభ నిరసన మాత్రమేనని, ఆమరణ నిరాహార దీక్ష ద్వారా ముగింపు పలుకుతానని, తద్వారా పేదలకు మేలు చేయడమే తన లక్ష్యమని ధీమా వ్యక్తం చేశారు. టి ఆర్ పురం లబ్ధిదారులకు వెంటనే ఇళ్ల పత్రాలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. లేనివారు ఇంటి పట్టా పొందడం తమ హక్కు అని తెలిపారు. ఈ గ్రామంలో గడపగడప కార్యక్రమానికి వచ్చిన నారాయణస్వామి మాట తప్పి మడమ తిప్పారని తీవ్ర స్థాయిలో విమర్శించారు. మీకందరికీ ఇళ్ల పట్టాలు ఇస్తానని చెప్పి వచ్చిన నారాయణస్వామి దానిని పెడచెవిన పెట్టారని ఎద్దేవా చేశారు. ఇప్పటికైనా పోయేముందు(ఒడి) ప్రజలకి ప్రయోజనం చేకూర్చి వెళ్ళు స్వామీ అని తెలియ జేశారు. పవన్ కళ్యాణ్ ను ఓడించడం నీ తరం కాదని, మీ తాతలు సమాధిలో నుంచి లేచి రావాలని పునరుద్ఘటించారు. 2024 ఎన్నికల్లో నిన్ను ఓడించేది జనసేన మాత్రమేనని హెచ్చరించారు. నిన్ను శాశ్వతంగా ఇంట్లో కూర్చో బెట్టబోయేది కూడా జనసేన మాత్రమేనని హితవు పలికారు. ప్రస్తుత ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పవనిజం పూర్తిగా పనిచేస్తుందని, కుల మత బేదాభిప్రాయం లేకుండా ఈ రాష్ట్రం అంగరంగ వైభవంగా అభివృద్ధి చెందబోతుందని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ బూత్ కన్వీనర్ యతీశ్వర్ రెడ్డి, జిల్లా కార్యక్రమ కమిటీ సభ్యులు భాను చంద్ర రెడ్డి, వెదురుకుప్పం మండల ఉపాధ్యక్షులు మునిరత్నం..శెట్టి. వెదురుకుప్పం మండల ఇంచార్జ్ మరియు నియోజకవర్గ యువజన ప్రధాన కార్యదర్శి వెంకటేష్, జిల్లా సంయుక్త కార్యదర్శి నరేష్, స్థానిక నాయకులు మోహన్, దాము, గురు ప్రసాద్ గ్రామస్తులు పాల్గొన్నారు.


All Rights Reserved By Janaswaram News.
Print Save
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్
  • హోమ్
  • న్యూస్
  • ఎడిటోరియల్
  • సినిమా
  • స్పోర్ట్స్
  • నారీ స్వరం
  • జిల్లా వార్తలు
    • అనంతపురం
    • కర్నూలు
    • కడప
    • చిత్తూరు
    • నెల్లూరు
    • ప్రకాశం
    • గుంటూరు
    • కృష్ణా
    • పశ్చిమగోదావరి
    • తూర్పు గోదావరి
    • విశాఖపట్నం
    • విజయనగరం
    • శ్రీకాకుళం
    • తెలంగాణ
  • భగవద్గీత
  • న్యూస్ పేపర్

Designed By www.Webdigitalway.com