అరకు ( జనస్వరం ) : చింతపల్లి మండలం ఎర్రబొమ్మలు పంచాయితీ పెద్దూరు గ్రామ యువతతో జనసేనపార్టీ నాయకులు పాడేరు జనసేనపార్టీ ఇన్చార్జ్ డా..వంపూరు గంగులయ్య, కార్యదర్శి ఉల్లి సీతారామ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్ తదితర జనసైనికులు హాజరయ్యారు. ఈ సమావేశంలో డా..గంగులయ్య మాట్లాడుతూ మన గిరిజన ప్రజలకు రాజకీయ చైతన్యం లేకపోవడమే ప్రభుత్వాలు మనల్ని, మన ప్రాంతల్ని, మన సహజ వనరులని దోచుకోవడానికి ప్రధాన కారణం. అలాగే నియోజకవర్గంలో అనేక కుగ్రామలు నేటికి మౌలిక సదుపాయాలు కల్పనలో కూడా ప్రభుత్వం వైఫల్యం చెందింది. ఇదిగాక రోజురోజుకీ మనకు రక్షణ కల్పించే హక్కులు, చట్టాలను నిర్వీర్యం చేస్తుంది మన ప్రాంతంపై గుత్తాధిపత్యం పొంది మనల్ని నాశనం చేయాలనే కంకణం కట్టుకుంది ఈ ప్రభుత్వం. ఆదివాసీ ద్రోహుల ప్రజాప్రతినిధులు చింతపల్లి లో సభ పెడతరంట ఏమీ చేసారని ఏ అభివృద్ధి చేసారని సభ పెడతారు? జాతి ద్రోహానికి పాల్పడింది మన గిరిజన ప్రజాప్రతినిధులు,ఈ ప్రభుత్వం మళ్ళీ గిరిజనులను మోసం చెయ్యాలనే కుట్రలు, కుతంత్రాలు చేస్తుంటే విద్యావంతులైన యువత ప్రతిఘటించాలి. రానున్న రోజుల్లో భావితరాలకు తీవ్ర నష్టం జరిగే అవకాశాలు లేకపోలేదు. యువత మేల్కోవాలి మార్పు కోసం, రాజకీయ చైతన్యవంతులు కావాలి గిరిజన జాతికి రక్షణగా నిలవాలి ఇదే మేము గ్రామ బాట నేటికి నియోజకవర్గ పరిధిలో అనేక గ్రామాలను తిరువుతూ ప్రజల్లో చైతన్యం కలిగిస్తున్నామన్నారు. ఈకార్యక్రమంలో జనసేనపార్టీ కార్యదర్శి ఉల్లి సీతారామ్, జిల్లా సంయుక్త కార్యదర్శి కిల్లో రాజన్, కార్యనిర్వక కమిటీ సభ్యులు తాంగుల రమేష్, చింతపల్లి మండల ఉపాధ్యక్షులు వంతలా రాజరావు, కూడ అబ్బాయి దొర, మజ్జి సత్యనారాయణ, మజ్జి నగేష్, అశోక్ గ్రామ యువత పాల్గొన్నారు.